హోటల్స్ ఆహార కల్తీ, ఆహార తయారీలో నాణ్యత ప్రమాణాలు లేవు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 07:

హోటల్స్ ఆహార కల్తీ, ఆహార తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించక పోవడం వంటి సమస్యలు ప్రజారోగ్యం మీద తీవ్ర ప్రభా వాలు చూపుతాయని జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్ అన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా వ్యాప్తంగా వివిధ హోటల్స్ మరియు ఆహార తయారీ వ్యాపారాలలో విపరీతమైన కల్తీ నాణ్యత లోపం నిల్వ సరుకుల సరఫరా జరుగుతుందని వెలువెత్తుతున్న ఫిర్యాదులపై జిల్లా యంత్రాంగం తీవ్రంగా స్పందించి జిల్లా జాయింట్ కలెక్టర్ జిల్లాలోని ఆహార తయారీ కేంద్రాల తనిఖీకి ఆదేశించారన్నారు. మంగ ళవారం జిల్లా వ్యాప్తంగా జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఏడు ముఖ్యమైన పట్టణాల్లో పౌరసరఫరాల శాఖ ఆహార భద్రత శాఖ తూని కల కొలతల శాఖల ఆధ్వర్యంలో సంయుక్త తనిఖీలు జరిగా యన్నారు .దాదాపు 200 ప్రదేశాల్లో ఏకకాలంలో జరిగిన తనిఖీల్లో గుర్తించిన అనేక లోపాలపై తక్షణమే చర్య తీసుకోవడం జరిగిందన్నారు. ఈ విషయంలో జాయిం ట్ కలెక్టర్ స్పందిస్తూ ఎక్కడా కూడా ఆహార కల్తీలు గాని నాణ్యతలేని ఆహారాన్ని అనారోగ్యాన్ని కలిగించే ఆహారాన్ని సరఫరా చేయడాన్ని సహించబోమని ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని ఈ విధమైన తనిఖీలు విస్తృ తంగా చేపట్టనున్నట్లు తెలిపారు. అన్ని హోటల్స్ రెస్టారెంట్లు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించిన నియమాలను తప్పక పాటించాలన్నారు. కానీ కొన్ని చోట్ల ఈ నిబంధనలు పాటించకపోవడం వల్ల ఆహారం కల్తీ అవ్వడం లేదా నాణ్యత తగ్గడం జరుగు తుందని ఇటువంటి చర్యలు పునరా వృతం కాకుండా ఆయా యజమాన్యాలు వ్యవహరిం చాలని ఆదేశించారు. నిల్వ మరి యు కాలం చెల్లిన పదా ర్థాలు హానికర పదా ర్థాలు ఆహార తయారీలో విని యోగించ రాదన్నారు.నాణ్యత నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఆయా యాజ మాన్యాలు బాధ్యత వహిం చాల్సి ఉంటుం దన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆహార కల్తీలో ఫుడ్ సేఫ్టీ, తూనికలు కొలతలు విషయంలో తూనికలు కొలతల శాఖ జరిమానాలు విధించడం తోపాటుగా లైసెన్స్ రద్దు వంటి చర్యలు గైకొనడం జరుగుతుంద న్నారు.భద్రతతో కూడిన ఆహారం అందించకపోతే వ్యాపారాలను పూర్తిగా రద్దు చేయాల న్నారు ఈ తనిఖీలలో ఇంకా జిల్లా తూనికల కొలతల అధికారి విశ్వేశ్వరరావు జిల్లా ఆహార భద్రత అధికారి రామ య్య పౌరసరఫరాల శాఖ ఉప తాసిల్దార్లు పాల్గొన్నారు.

Related Articles

చౌక రేషన్ దుకాణాల పని వేళలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 29: ఉదయం 8.00 నుండి 12.00 గంటల వరకు నుండి సా. 4.00 గంటల నుండి 8.00 గంటల వరకు రేషన్ […]

రోడ్డు ప్రమాదంలో ఆలమూరు ఎస్సై మృతి పై పోలీస్ శాఖ దిగ్బ్రాంతి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -సూర్యపేట జూన్ 26: సూర్యపేట కోదాడ సమీపంలోని ఘోర ప్రమాదం ప్రమాదంలో మరణించిన ఎస్సై కానిస్టేబుల్ పట్ల రాష్ట్ర పోలీస్ శాఖ దిగ్బ్రాంతి చెందింది. […]

కోరంగి PA CS కమిటీ ప్రమాణ స్వీకారానికి ఎంపీ హరీష్ బాలయోగి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -తాళ్లరేవు సెప్టెంబర్ 16: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలో ప్రాథమిక […]