22 నుండి జీఎస్టీ పన్నులను తగ్గించి సులభంగా అమలులో ఉన్నాయి: కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబరు 25:

కేంద్ర ప్రభుత్వం ఈనెల 22 నుండి జీఎస్టీ పన్నులను తగ్గించి, సులభంగా అమ లు అయ్యేలా కార్యాచరణ పై వివిధ శాఖల అధికారు లు ప్రత్యేక దృష్టిసారించి జీఎస్టీ ప్రయోజనాలు విని యోగదారులకు చేరేలా అన్ని స్థాయిలలో పర్యవేక్షించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశిం చారు. గురువారం స్థానిక అమలాపురం కలెక్టరేట్ నందు జిల్లాస్థాయి అధికారులు జీఎస్టీ సంస్కరణలు అమలుపై కమర్షి యల్ టాక్స్ డిప్యూటీ కమిషనర్ జీఎస్టీ 2.0 సంస్కరణలు కోనసీమ నోడల్ జిల్లా అధికారి సిహెచ్ రవికుమార్ తో సమీక్షించారు. ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అత్యవసర వస్తువులపై పన్నులు గణనీయంగా తగ్గించబడ్డాయన్నారు
వ్యవసాయ యంత్రాలు, జన ఆరోగ్య సేవలు, విద్యా సేవలకు తక్కువ జిఎస్టి వర్తింపజేశారన్నారు. ఇంటి పరికరాలపై జీఎస్టీ ని తగ్గించారన్నారు.ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై పూర్తి మినహాయింపు ఇచ్చారన్నారు.జిల్లా స్థాయి లోని వాణిజ్య, పన్ను శాఖ అధికారులు ఈ మార్పులపై పన్ను చెల్లింపు దారులకు అవగాహన కల్పించాలన్నా రు ఎక్కువగా ఎం ఎస్ ఎం ఈ లు రైతులు, పారిశ్రామిక వేత్తలకు ఈ తగ్గింపు సంస్క రణలు ఊతమిస్తాయన్నా రు. ప్రజలకు ముఖ్యమైన వస్తువులు తక్కువ ధరకు అందుతాయనీ, ఎమ్ ఎస్ ఎంఈలకు పన్ను భారం తక్కువ అయ్యి, స్పష్టమైన స్థాయిలో వృద్ధి కలిసొస్తుం దన్నారు జీఎస్టీ సంస్కర ణలు అమలులో అధికా రులు, వాణిజ్య పన్ను శాఖ అధికారులు ముఖ్య పాత్ర పోషించి ఆ యొక్క లబ్ధిని వినియోగదారులకు అందించాలన్నారు.
వ్యాపారులు, ఉత్పత్తిదారులు సమన్వ యంతో వినియోగదారు లకు తగ్గింపు లబ్ధిని చేకూర్చాలన్నదే సంస్కరణల ఆశయమన్నారు. వ్యవ సాయ ఆధారిత జిల్లాగా ఉన్న కోనసీమలో వ్యవ సాయం ఉద్యాన రంగాల లో మరింత అవగాహనను తగ్గింపు జీఎస్టీ పై పెంచాల్సి ఉందన్నారు. ప్రాణాలను కాపాడే అత్యవసర ఔషధా లపై జిఎస్టి ని జీరో గా నిర్ణయించారన్నారు. ప్రతి స్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థను బలో పేతం చేసి వినియోగ దారులకు భరోసాగా నిలవాలన్నారు. వ్యాపారులు జారీ చేస్తున్న బిల్లులను పరిశీ లించి జీఎస్టీ తగ్గించినది లేనిది పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో వస్తువుల కొనుగోలుపై ఎక్కడ ఫిర్యాదులు ఉత్పన్నం కాకుండా అధికారులు సమన్వయంతో వ్యవహ రించాలన్నారు. ఈ కార్య క్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాoతి, డీఎస్ఓ ఏ ఉదయభాస్కర్, ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీ బి రాజ్య లక్ష్మి, వ్యవసాయ శాఖ అధికారి బోసు బాబు, మత్స్య శాఖ అధికారి శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్, జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు జిల్లాస్థాయి లో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Related Articles

జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సర్వసభ్య సమావేశానికి కలెక్టర్ ఆహ్వానం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 30: జూలై రెండో తేదీ బుధవారం జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సర్వసభ్య సమావేశానికి ప్రతి జిల్లా అధికారి పూర్తి […]

చించినాడ బ్రిడ్జి పై రాకపోకలు బంద్ /1995 సంవత్సరంలో నిర్మించారు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం,జూలై 24: పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం చించినాడ గ్రామం – దిండి గ్రామం, మల్కిపురం మండలం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా […]

కోనసీమ రైల్వే లైనుకు మార్గం సుగమం/ఎంపీ హరీష్ హర్షం

భూసేకరణ ప్రక్రియపై విధించిన స్టే ఉత్తర్వులను తొలగించిన హైకోర్టు… హైకోర్టు ఉత్తర్వులను స్వాగతించిన ఎంపీ హరీష్ బాలయోగి… కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైను మార్గం పూర్తిచేయడానికి ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటి తొలగతుండటంతో కోనసీమ రైల్వే లైన్ […]

త్వరలో ఆక్వా రైతులకు సాగు ధృవీకరణ పత్రాలు: అచ్చెన్నాయుడు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమరావతి ఆగస్టు 14: ఆక్వా రైతులకు సాగు ధృవీకరణ పత్రాలు త్వరలో అందుతున్నాయని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులకు […]