

భూసేకరణ ప్రక్రియపై విధించిన స్టే ఉత్తర్వులను తొలగించిన హైకోర్టు…
హైకోర్టు ఉత్తర్వులను స్వాగతించిన ఎంపీ హరీష్ బాలయోగి…

కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైను మార్గం పూర్తిచేయడానికి ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటి తొలగతుండటంతో కోనసీమ రైల్వే లైన్ మార్గం సుగమం కానుంది.భూసేకరణ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన కేసులలో హైకోర్టు నేడు ఉత్తర్వులను వెలువరించింది.భూసేకరణ ప్రక్రియను నిలిపివేయాలంటూ దాఖలు చేసిన కేసులపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.ప్రభుత్వం తరుపున సమర్పించిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం భూసేకరణ ప్రక్రియపై ఉన్న స్టే ఉత్తర్వులను ఎత్తివేసింది.
హైకోర్టు ఉత్తర్వులను స్వాగతించిన ఎంపీ హరీష్ బాలయోగి…
కోనసీమ రైల్వే ప్రాజెక్టు భూసేకరణ పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి పేర్కొన్నారు. ఈ తీర్పుతో రైల్వే పనుల ప్రక్రియ తిరిగి త్వరిగతిన చేపట్టేలా కృషి చేస్తామన్నారు.రైతులు నష్ట పోకుండా వారికి న్యాయం చేసేలా కృషి చేస్తానన్నారు. హైకోర్టు తీర్పుతో కోనసీమ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.ఎన్నో ఏళ్లుగా కోనసీమ ప్రజల చిరకాల కోరిక అయిన రైల్వే ప్రాజెక్టు పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఎంపీ హరీష్ బాలయోగి తెలిపారు.