


V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 30:
జూలై రెండో తేదీ బుధవారం జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సర్వసభ్య సమావేశానికి ప్రతి జిల్లా అధికారి పూర్తి సమగ్ర సమాచారంతో హాజరు కావాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం స్థానిక అమలాపురం కలెక్టరేట్ నందు జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి సర్వసభ్య సమావేశం నిర్వహణ పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర సమాచారంతో జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశానికి హాజరై గౌరవ సభ్యులు కోరిన సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారుల దేనిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారులు పాల్గొ న్నారు.