పరిశుభ్రత సంస్కృతి ప్రజలు అలవర్చి కోవాలి స్వచ్ఛత హి సేవ: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 25:

స్వచ్ఛత హి సేవ కార్యక్ర మం ద్వారా పరిశుభ్రత సంస్కృతిని ప్రజల్లో అల వర్చి గ్రామాలు పట్టణాలలో ఆహ్లాదక రమైన పరిశుభ్ర వాతావరణంలో తీసుకుని రావాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పుర జనులకు పిలుపు నిచ్చారు. గురువారం స్వచ్ఛత హి సేవ కార్యక్ర మంలో భాగంగా స్వచ్చోత్సవ్ నేపద్యంలో స్థానిక పట్టణంలోని సర్క్యులర్ బజార్ నందు నిర్వహించిన ఏక్ దిన్, ఏక్ ఘంట, ఏక్ సాత్ ఒక రోజు, ఒక గంట నినాదంతో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి రెవెన్యూ డివిజ నల్ అధికారి కె.మాధవి మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్ కుమార్ ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు మరియు పట్టణ ప్రజలతో కలిసి సర్క్యులర్ బజార్ నందు శ్రమదానం చేశారు.

ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలలు అలంకరించి, ఘ నంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మున్సిపల్, సచివాలయ మరియు మెప్మా సిబ్బంది వేసిన స్వచ్ఛత రంగోలిని పరిశీలించి, కార్యక్రమంలో పాల్గొన్న అందరి చేత స్వచ్ఛతా హి సేవ ప్రతిజ్ఞ చేయించారు ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ ప్రధాన స్వచ్ఛత ఉద్యమాలలో ఈ కార్యక్ర మం ఒకటని,ప్రజల్లో స్వచ్ఛతపై చైతన్యం కల్పించడం మరియు కలిపి పని చేయడం ద్వారా పరి శుభ్రతను ప్రోత్సహిస్తూ స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశ్యా లను ముందుకు తీసుకుని వెళ్లాలన్నారు వ్యర్థాల నిర్వహణ, శానిటేషన్, ఓడీఎఫ్ ప్లస్ గ్రామాల రూపకల్పన కమ్యూనిటీ, వివిధ శాఖలు, స్వచ్ఛత మిత్రులు మరియు కార్యాలయాల భాగస్వా మ్యంతో పెద్ద ఎత్తున శ్రమదాన కార్యక్రమాలలో పాల్గొనాలన్నారు.2025 సంవత్స రంలోని స్వచ్ఛో త్సవ్”అనే ఇతివృత్తంతో శుద్ధిని ఉత్సవంగా మార్చ డానికి- 17 సెప్టెంబర్ నుండి 2 అక్టోబర్ వరకు పెద్ద ఎత్తు న ప్రజలు పాల్గొంటున్నా రన్నారు ఈ భారీ శ్రమదా నం కార్యక్రమం ద్వారా ప్రజలు, పురజనులు పరిశుభ్రత వైపు ముందుకు సాగాలన్నారు జిల్లా జా యింట్ కలెక్టర్ మాట్లాడుతూ. పరిశుభ్రత పై అవగాహన చర్యలు బలోపేతం చేస్తూ సామా జిక ప్రవర్తన మార్పు కొరకు సమన్వయంతో పాటు పడాలన్నారు. ప్రజల పాత్ర, ప్రజా సోదరత్వం స్వచ్ఛత హి సేవ క్రియా శీలక కార్య క్రమాలు ప్రజల భాగస్వా మ్యాన్ని ప్రోత్స హిస్తాయ న్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ మున్సి పల్ ,సచివాలయ మెప్మా సిబ్బంది ప్రజా ప్రతినిధులు పట్టణ పౌరులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

54 గ్రామ మత్స్యకారులు కుటుంబాలకు 28న నష్ట పరిహారం: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం, డిసెంబర్ 24: డాక్టర్ బి.ఆర్ అంబే ద్కర్ కోనసీమ జిల్లాలోని ఏడు మండలాల పరిధి లో 54 గ్రామాలకు చెందిన మత్స్య కారులకు […]

చెల్లుబోయిన శ్రీనివాస్ పార్థివదేహానికి నివాళు లర్పించిన మాజీ మంత్రి గొల్లపల్లి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – రాజోలు జూలై 21: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, , […]

కూటమి ప్రభుత్వ పాలన దివ్యాంగుల పాలిట వరం: మండపేట ఎమ్మెల్యే

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట జూలై 09: కూటమి ప్రభుత్వ పాలన దివ్యాంగుల పాలిట వరమని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. […]

చైర్మన్ వినయ్ కుమార్ కు అనకాపల్లిలో స్వాగతం తో రారాజు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అనకాపల్లి జనవరి 16:V9 ప్రజా ఆయుధం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధినేత కు అనకాపల్లి లో రారాజు స్వాగతం పలికారు. డాక్టర్ బి […]