
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమరావతి ఆగస్టు 14:

ఆక్వా రైతులకు సాగు ధృవీకరణ పత్రాలు త్వరలో అందుతున్నాయని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ఆక్వా కల్చర్ రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి, ప్రపంచ స్థాయిలో నిలుపుతామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు డి-పట్టా, అసైన్, సీజేఎఫ్ఎస్ భూములపై చేపల పెంపకం చేస్తున్న రైతులకు ఆక్వా అభివృద్ధి సంస్థ చట్టం ప్రకారం సాగు ధ్రువీకరణ పత్రం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దీనిద్వారా వారు ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సహాయం పొందే అవకాశం కలుగుతుందని తెలియజేశారు.