చించినాడ బ్రిడ్జి పై రాకపోకలు బంద్ /1995 సంవత్సరంలో నిర్మించారు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం,జూలై 24:

పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం చించినాడ గ్రామం – దిండి గ్రామం, మల్కిపురం మండలం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మధ్యలో నేషనల్ హైవే-216 పాత నం. 214 పై 1995 సం|| నుండి 2001 సం॥ వరకు ఆర్ అండ్ బి స్పెషల్ డివిజన్, భీమవరం, వారి ద్వారా నిర్మించబడిన చించి నాడ వంతెన (చించినాడ బ్రిడ్జ్)ప్రస్తుతం అతి శీఘ్రంగా మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు.. గురువారం స్థానిక కలెక్టరేట్ నందు రోడ్డు రవాణా, ఆర్ అండ్ బి ఆర్టీ సీ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించి చించినాడ వంతెన పై రాకపోకలు నిలుపుదల చేస్తూ రావులపాలెం మీదు గా రాకపోకలు సాధిం చాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారు చించినాడ వంతెనపై అత్యవసర మరమ్మత్తులు చేపట్టాలని నిర్ణయించా రన్నారు. మరమ్మత్తులు పూర్తయ్యే వరకు, ఈ వంతెనపై గరిష్ఠంగా గంటకు 30 కిలోమీటర్ల వేగంతో కేవలం లైట్ మోటార్ వెహికల్స్ ప్రయాణించడా నికి మాత్రమే అనుమతి ఇవ్వబడిందనీ మిగతా అన్ని రకాల వాహనాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయడమైనదన్నారు.


హెవీ మోటార్ వెహికల్స్ కోసం కత్తిపూడి నుంచి నర్సాపురం/ భీమవరం వైపు ప్రయాణించే వారు కత్తిపూడి- జగ్గంపేట రాజమహేంద్రవరం పాలకొల్లు నర్సాపురం / భీమవరం వెళ్లాలని సూచిం చారు

కాకినాడ నుంచి నర్సాపురం/ భీమవరం వైపు వెళ్లేవారు రావు లపాలెం సిద్ధాంతం మీదుగా వెళ్లాలని సూచించారు

కాకినాడ,రామచంద్రాపురం మండపేట నుండి వెళ్లేవారు రావులపాలెం సిద్ధాంతం మీదుగా పాలకొల్లు నర్సాపురం / భీమవరం చేరుకోవాల న్నారు

అమలాపురం నుంచి నర్సాపురం / భీమవరం వైపు వెళ్లేవారు అమలా పురం – కొత్తపేట, రావుల పాలెం సిద్ధాంతం మీదుగా పాలకొల్లు నరసాపురం భీమవరం చేరుకోవాల న్నారు
తాటిపాక/రాజోలు నుంచి నర్సాపురం/ భీమవరం వైపు వెళ్లేవారు తాటిపాక పి.గన్నవరం ఈతకోట
సిద్ధాంతం మీదుగా పాలకొల్లు నరసాపురం భీమవరం చేరుకోవాలన్నారు.యానాం నుండి బయలుదేరే వారు ద్రాక్షారామ రావులపాలెం, సిద్దాంతం మీదుగా పాలకొల్లు, నరసాపురం భీమవరం చేరుకోవాలన్నారు.

నరసాపురం నుంచి రాజోలు వైపు వెళ్లేవారు భీమవరం పాలకొల్లు సిద్ధాంతం రావులపాలెం మీదుగా రాజోలు చేరుకోవాలన్నారు

నరసాపురం నుండి రాజోలు బయలుదేరే వారు దిగమర్రు పాలకొల్లు సిద్ధాంతం రావులపాలెం మీదుగా రాజోలు చేరుకోవాలన్నారు

ప్రజల సౌకర్యార్థం, రవాణా భద్రతను దృష్టిలో ఉంచు కొని ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి డి శ్రీనివాసరావు ఆర్టీసీ ఆర్ఎం రాఘవ శ్రీనివాసు, జాతీయ రహదారులు ప్రాజెక్ట్ డైరెక్టర్ సాయి శ్రీనివాసు ,జాతీయ రహ దారులు ఏఈ వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు

Related Articles

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 225 ఆర్జీలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 19: ప్రతి సమస్యను ఖచ్చితంగా విశ్లేషించి హేతు బద్ధమైన పరిష్కార మార్గం చూపితే సత్వర పరిష్కారంతోపాటు సంతృప్తి కర స్థాయిలు మెరుగుపడతాయని […]

మడుపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సు.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి డిసెంబర్ 20:పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం మడుపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. స్థానిక మండల ఎమ్మార్వో నాగలక్ష్మిమ్మ […]

హోమ్ ప్రొసీడింగ్స్ ఐబి సెక్యూరిటీ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ పిడిఎఫ్ 4987 పోస్టులు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు వస్తున్నాయి -జూలై 27: Home Proceedings IB Security Assistant Recruitment 2025 Notification PDF Out for 4987 PostsIB Security Assistant […]

ఏ ఒక్క గుండె ఆగకూడదు-ఏ కుటుంబం బాధపడకూడదు:రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-రామచంద్రపురం జనవరి 7:సమాజం బాగుండాలంటే అందరికీ సంపూర్ణ ఆరోగ్యం ఉండాలనే స్ఫూర్తితో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకునే దిశగా […]