తిరుపతి రాజమండ్రి మధ్య కొత్త విమాన సర్వీసు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- రాజమండ్రి సెప్టెంబర్ – 20:

ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని రాజమండ్రి, భారత ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి మధ్య ప్రయాణ దూరం మరింత సంక్షిప్తం అయిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. అల్లయన్స్ ఎయిర్ సంస్థ ఈ అక్టోబర్ 1 న తొలి విమానంతో ఈ మార్గంలో సేవలు ప్రారంభించనుందని తెలిపారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ ను విడుదల చేశారు. ఏటీఆర్ 72 విమానం ఉదయం 09:25 గంటలకు తిరుపతి నుండి రాజమండ్రి చేరుకుని, తిరుగు ప్రయాణాన్ని ఉదయం 10:15 గంటలకు ప్రారంభిస్తుంది. అక్టోబర్ 2 నుండి ప్రతీ వారం మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో సేవలు ఉంటాయి. కొత్త సమయాల ప్రకారం ఉదయం 09:25కు తిరుపతి నుండి రాజమండ్రికి విమానం బయలు దేరి, ఉదయం 09:50కు తిరుగు ప్రయాణం సాగుతుంది. ఈ కొత్త ఎయిర్ కనెక్టివిటీ ప్రాంతీయ అనుసంధానాన్ని పెంపొందించడంతో పాటు వెంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వెళ్లే అనేక మంది భక్తులకు ఉపయోగపడనుంది అని అధికారులు ఆలోచన. ఈ సర్వీసు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు “కనెక్టెడ్ ఆంధ్రప్రదేశ్” ఆలోచనకు అనుగుణంగా ఏర్పాటు చేశామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఇంత మంచి సర్వీసు ప్రారంభించిన అల్లయన్స్ ఎయిర్‌కి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఇంకోవైపు తాజా సర్వీసు ప్రారంభం పట్ల ఇటు రాజమండ్రి, అటు తిరుపతి వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు, రామ్మోహన్ నాయుడు కృషికి ధన్యవాదాలు తెలిపారు.

Related Articles

చిన్న తరహా పరిశ్రమలకు ఎస్సీ ఎస్టీ మహిళలకు ప్రాధాన్యత: కార్మిక శాఖ మరియు కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రామచంద్రపురం డిసెంబర్ 22: సమ్మిళిత ఆర్థిక వృద్ధి సాధనలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు కీలక భూమిక పోషిస్తాయని రాష్ట్ర కార్మిక శాఖ […]

జామకాయ తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా?

తాజా పండ్లు తింటే ఆరోగ్యం బాగుంటుందన్న సంగతి తెలిసిందే. అయితే పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగడం హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యాపిల్, అరటి, పుచ్చకాయ, దోస, జామ వంటి పండ్లు తిన్న […]

త్వరలో ఆక్వా రైతులకు సాగు ధృవీకరణ పత్రాలు: అచ్చెన్నాయుడు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమరావతి ఆగస్టు 14: ఆక్వా రైతులకు సాగు ధృవీకరణ పత్రాలు త్వరలో అందుతున్నాయని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులకు […]

ఆంధ్రప్రదేశ్: ఐదు ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల.

నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. ఇప్పటికే షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అమరావతి: ఏపీ (AP)లో ఐదు ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీ స్థానాలకు (MLC Seats) సోమవారం నోటిఫికేషన్ […]