
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం నియోజకవర్గం సెప్టెంబర్ 19:
చెయ్యేరు లైన్మెన్ శర్మ సస్పెండ్ అయ్యారు.
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో కరెంటు బిల్లులు పెండింగ్ లో వున్న వినియోగదారుల సర్వీసులను తనిఖీకి వెళ్ళినపుడు, కొంతమంది వినియోగాదారుల నుండి డబ్బులు వసూలు చేసి డిపార్టుమెంట్ వారికి జమ చేయడం లేదని చెయ్యేరు లైన్ మన్ ఏవీఎస్ శర్మ మీద ఆరోపణలు వచ్చిన విషయం పై అధికారులు డిప్యూటీ ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్, ఆపరేషన్, ముమ్మిడివరం మరియు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ERO, అమలాపురం వారు విచారణ చేయగా, సదరు లైన్ మన్ పై వచ్చిన ఆరోపణలు నిజమని నిర్ధారణ అయినది. దీనిపై చెయ్యేరు లైన్ మన్ ను విధుల నుండి సస్పెండ్ చేశారు.
కనుక వినియోగదారులందరికీ తెలియజేయునది ఏమనగా, విద్యుత్ బిల్లులు చెల్లింపులు APEPDCL (Eastern power app, APEPDCL web site, online payment) ద్వారా గాని, QR Code స్కానింగ్ ద్వారా గాని మరియు డిపార్టుమెంటు ఆధరైజ్డ్ రెవిన్యూ క్యాష్ కౌంటర్ నందు మాత్రమే చెల్లించ వలెను. మరియు RTGS/NEFT ద్వారా ఎకౌంటు కు జమచేయు వ్యక్తులు సంభందిత అధికారి అయిన AAO/ERO/APEPDCI/AMALAPURAM వారికి మాత్రమే బ్యాంకు వోచరు, సర్వీస్ నెంబర్లు మరియు అమౌంట్ తెలియజేయవలెయును. ఇతర వ్యక్తులు ఎవరికీ కరెంటు బిల్లు చార్జీలు, నగదు రూపంలో చెల్లింపులు చేయరాదని డీఈఈ రాంబాబు తెలిపారు.