చిన్న తరహా పరిశ్రమలకు ఎస్సీ ఎస్టీ మహిళలకు ప్రాధాన్యత: కార్మిక శాఖ మరియు కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రామచంద్రపురం డిసెంబర్ 22:

సమ్మిళిత ఆర్థిక వృద్ధి సాధనలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు కీలక భూమిక పోషిస్తాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు.

ఆదివారం స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం వి ఎస్ ఎం కళాశాల నందు జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ కోనసీమ పేరిట నిరుద్యోగ యువతీ యువకులకు ఎమ్ ఎస్ ఎం ఇ పరిశ్రమల స్థాపన కై అవగాహన సదస్సును నిర్వహించారు.

మంత్రి మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులు వినూత్న ఆలోచనలతో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు వస్తే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా పరిశ్రమల స్థాపన ఒక ఆచరణీయ వృత్తిగా ఎంచుకునే వారిని అన్ని విధాల ప్రోత్సహించాలన్నారు నిరుద్యోగ యువత ఆలోచనలకు అనుగు ణంగా వారికి ఆసక్తి ఉన్న రంగంలో పరిశ్రమలు నెలకొల్పుకు నేందుకు దరఖాస్తు దగ్గర నుండి రుణాలు కల్పనతో పా టుగా రాయితీలతో ప్రోత్స హిస్తూ పరిశ్రమ స్థాపన దిశగా అన్ని దశలలో పూర్తి సహకారం అందించేందుకు సిబ్బం దిని బృందాలుగా నియ మించడం జరిగింద న్నారు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు విషయంలో అన్ని విధాల సహకరించ డానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామిక వేత్త తయారు కావాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆ దిశగా ఒక ప్లాట్ ఫారం మీకు అన్ని విధాల సహకరించేందుకు స్థాని కంగా 24/7 అందుబాటులో ఉండే విధంగా మీతో పాటు నడవడానికి సిద్ధంగా ఉండేలా ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. కొబ్బ రి ముడిసరుకు ఆధారంగా 15 రకాల విలువ ఆధారిత వస్తువులను తయారు చేసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గడచిన ఆరు నెలలలో రాష్ట్రంలో పరిశ్రమ స్థాపన కొరకురూ 1,50,000 కోట్ల పెట్టుబడులను తెచ్చిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సామాజిక భద్రతా పింఛన్లు 4 వేలకు పెంచి ఇవ్వడం జరుగుతోందిన్నారు.

పరిశ్రమల స్థాపనలో 35% రాయితీలను అదేవిధంగా పరిశ్రమలకు పెట్టుబడులకు గాను బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించడం ద్వారా పరిశ్రమల స్థాపనకు ఇటోదికంగా సహాయ పడటం జరుగుతుందన్నారు. నిరుపేద వితంతువులకు కుట్టు, ఎంబ్రాడయిరీ కుట్టు పరిశ్రమలు నెలకొ ల్పుకు నేందుకు అవసరమైన పెట్టుబడిని తానే సమకూ ర్చడం జరుగుతుందని మంత్రి సుభాష్ హామీ ఇచ్చారు. కోటిపల్లి గ్రామ సమీపంలో 350 ఎకరాలు ప్రభుత్వ పట్టా భూములు ఉన్నాయని పాడి పరిశ్ర మపై ఆసక్తి ఉన్న రైతులకు పాడి గేదెల యూనిట్లు కొరకు రుణాలు ఇప్పించి పశుగ్రాసం పెంచుకునేందుకు పట్టా భూమిని, పశుగ్రాస విత్తనాలను ఇవ్వడం జరుగు తుందన్నారు. అరటి పండ్లును సోలార్ డ్రైయర్ ద్వారా విలువ ఆదారికంగా మార్చుకుని లాభాన్ని అర్జించవచ్చునని ఆయన స్పష్టం చేశారు..ప్రతి ఇంట్లో ఓ పారి శ్రామికవేత్తను తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ప్రభుత్వ సహకారం తో నిరుద్యోగ యువత పారీశ్రామికవేత్త గా మారటానికి ఈ అవగాహన ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. తద్వారా పారిశ్రామిక రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తుం దన్నారు సీఎం, డిప్యూటీ సీఎంలు దూర దృష్టితో ఆలోచించి నూతన పారిశ్రామిక విధానానికి శ్రీకారం చుట్టారన్నారు. పరిశ్రమలు ఏర్పాటుకు అనుకూలమైన వాతా వరణం సృష్టించడంతో పాటు ఆర్థిక భద్రత, అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. ఉద్యం పోర్టల్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకొని ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ అందించే ప్రోత్సాహకాలకు అర్హత సాధించాలని సూచిం చారు. స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసే నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణా కేంద్రాల ద్వారా చేయూత అందిస్తామ న్నారు.

విసూత్న ఆలోచ నలతో ముందుకు రావాలని నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు.జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పరిశ్ర మలు ఏర్పాటులో ఎస్సీ, ఎస్టీ, మహిళలకు అదనపు ప్రోత్సాహకాలు ఉంటాయని తెలిపారు. కార్మిక శాఖ మంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ కోనసీమ పేరిట పరిశ్రమల స్థాపనకు ఎంతగానో కృషి సల్పు తున్నారని ఆ దిశగా నిరుద్యోగ యువత తమ వినూత్న ఆలోచనలతో ఆసక్తిని కనబరిచి ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా జీవన ప్రమాణాలను మెరుగు పరుచు కోవాలని ఆకాంక్షించారు. మంత్రి నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామిక వేత్త తయారు కావాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా స్థానికంగా ఒక ప్లాట్ఫారాన్ని సృష్టిం చారని తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో నడ పాలని కార్మికశాఖ మంత్రి ఎంతో తపిస్తున్నారన్నా రు. పరిశ్రమ స్థాపనకు ముందుకు వచ్చే వారికి పెట్టుబడులు అందించ డంతోపాటు వారు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌలభ్యం కూడా కల్పించడం జరుగుతుందన్నారు. ముందుగా నిరుద్యోగ యువత వారికి ఏ రంగంలో ఆసక్తి ఉందో తెలియపరిస్తే ఆ దిశగా టీములు ఆయా రంగ పరిశ్రమల ఉత్పత్తి విధి విధానాలపై అవగాహనను పెంపొందిస్తారని తెలిపారు.

నైపుణ్యాలను పరిగణనలో తీసుకుని వాటి ఆధారంగా పరి శ్రమల ఏర్పాటుకు అవకాశాలు నిండుగా ఉన్నాయన్నారు. జిల్లాలో ప్రాథమిక సెక్టార్ అయిన వ్యవసాయ అనుబంధ రంగాలు ఉన్నప్పటికీ రెండో సెక్టార్ పారిశ్రామి కంగా అంతంత మాత్రమే ఉందని ఈ ఎం ఎస్ ఎం ఈ ద్వారా మరిన్ని పరి శ్రమలు రావాలని ఆయన ఆకాంక్షించారు. రెండవ సెక్టార్ అయిన పారిశ్రా మిక రంగ అభివృద్ధికి మంత్రి వర్యులు తీసు కున్న చొరవను ఆయన ఈ సందర్భంగా అభినం దించారు. పారిశ్రామిక రంగ సెక్టారుకు ప్రభుత్వం నుండి ఏ సహకారం కావాలన్న తప్పనిసరిగా అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో కొత్తపేట శాసనసభ్యు లు బండారు సత్యానంద రావు రెవిన్యూ డివిజన్ అధికారి డి అఖిల, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పీ కే పీ ప్రసాద్ తాసిల్దార్ సావిత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, వార్డ్ నెంబర్లు పాల్గొన్నారు.

Related Articles

బాణాసంచా తయారీ కేంద్రాలు, విక్రయ కేంద్రాలు పై అధికారులు ఉక్కు పాదం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 9: బాణాసంచా తయారీ కేంద్రాలు, విక్రయ కేంద్రాలు నిర్వహించే వారు ప్రజల భద్రత, పర్యావరణ పరి రక్షణ, చట్టపరమైన ప్రమాణాలు తప్పనిసరిగా […]

ఎస్సీ,ఎస్టీ అట్రాసిటికేసుల విచారణవేగవంతం:ఎమ్మెల్యే ఆనందరావు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం డిసెంబర్ 26:ఎస్సీ ఎస్టీలపై అన్యాయంగా దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు గైకొనాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. […]

శ్రీకాకుళం బారువ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆకట్టుకున్న సంక్రాంతి సంబరాలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- శ్రీకాకుళం బారువ 09: ప్రభుత్వ డిగ్రీ కళాశాల బారువ లో చేపట్టిన సంక్రాంతి సంబరాలు అందరిని ఆకట్టుకున్నాయి అంటూ ఉపాధ్యాయులను ప్రజా ప్రతినిధులు అభినందించారు. […]

అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు బీచ్, సినీ నటి హెబ్బా పటేల్ రాక

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్. యానాం బీచ్ లో అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరగనున్నాయి.ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ హీరోయిన్ […]