
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం సెప్టెంబర్ 20:

డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అమలాపురం నందు రెండవ దశ డిగ్రీ అడ్మిషన్స్ సోమవారం నుండి ప్రారంభ మవుతున్నాయని కళాశాల ప్రిన్సిపాల్ డా వి. నరసింహ స్వామి తెలిపారు . రెండు సంవత్సరాలు సాధారణ ఇంటర్మీడియట్, వొకేషనల్ మరియు ఓపెన్ ఇంటర్ పాసైన విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని చుట్టు పక్కల మండలాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. బయట కొంత మంది వ్యక్తులు ఈ కళాశాల తిరిగి ఎక్కడికో తరలి వెళ్లి పోతుందని దుష్ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చింది. ఈ కాలేజీ అమలాపురం వదిలి ఎక్కడికి వెళ్ళదని , ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరం పేరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణ లో నడుస్తుందని, శాసనసభ్యులు అయితాబత్తుల ఆనంద రావు మరియు జిల్లా కలెక్టర్ అర్ మహేష్ కుమార్ గార్ల సహకారంతో వచ్చే విద్యా సంవత్సరానికి నూతన భవనాలు నిర్మించడానికి ఇప్పటికే స్థలం, నిధులు కూడా సిద్ధమయ్యాయి. నూతన భవనాల నమూనాలు జిల్లా డి. ఈ రాజకుమార్ నేతృత్వం లో తయారయ్యి కలెక్టర్ అనుమతి కొరకు వేచి ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం రెండవ దశ డిగ్రీ బి. ఏ, బి. కాం మరియు బి. ఎస్ సి కంప్యూటర్ సైన్స్ కోర్సుల లో అడ్మిషన్స్ సోమవారం నుండి ప్రారంభ మవుతున్నాయని, అడ్మిషన్స్ కన్వీనర్ శ్రీమతి పి. కరుణశ్రీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్మిషన్స్ కో కన్వీనర్స్ డా. ఏం. బాల స్వామి, డా. బి. ఆశిష్ బాబు, అధ్యాపకులు పి శేఖర్, ఎన్. రాజతేజ, మురళీ కృష్ణ పాల్గొన్నారు. వివరాలకు: 9491191635, 9490977555, 9441481707, 8074726289, 9915678760.