
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 17:

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రేషన్ అక్ర మాలకు చెక్ పెడుతూ ఆధునిక సాంకేతికతతో క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ కార్డులను రూపొం దించిందని జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే జిల్లాకు సంబంధించి ఈ స్మార్ట్ రేషన్ కార్డులలో జిల్లా పేరు తప్పు గాను మరియు సరిగ్గా న మోదు కాకపోవడంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహాశయుని పేరిట వెల సిన ఈ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పూర్తిగా పడకపోవడం విషయంలో ప్రజా, సామాజిక సంఘాల ప్రతినిధులు ఇతరత్రా ప్ర ముఖుల మనోభావాలను, ఆవేదనను జిల్లా యంత్రాంగం గుర్తించిందన్నారు.ఈ పొరపాటు సరిదిద్దాలని ప్రజల మనోభావాలను గుర్తించిన జిల్లా యంత్రాం గం జిల్లా జాయింట్ కలెక్టర్ వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరంతరం సంప్రదించారనీ ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి దిద్దుబాటు చర్యలను తీసు కోవాలని పౌర సరఫరాల శాఖను ఆదేశించిందన్నారు. దానికి అనుగుణంగా పౌర సరఫరాల శాఖ వారు స్మార్ట్ రేషన్ కార్డు పై ఉన్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే ప్రస్తుతం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పూర్తిగా కనపడే విధం గా పూర్తిగా వచ్చేలా మార్పు చేశారన్నారు. ఇప్పుడు జిల్లాలో ఏ ఒక్క స్మార్ట్ రేషన్ కార్డును స్కాన్ చేసిన పూర్తిగా జిల్లా పేరు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పూర్తిగా కనబడు తుం దన్నారు అదేవిధంగా జిల్లా జాయింట్ కలెక్టర్ వారు జిల్లాలోని ప్రస్తుతం సరఫరా కాపాడు తున్న అన్ని స్మార్ట్ రేషన్ కార్డ్ లో కూడా భౌతికంగా జిల్లా పేరు మార్పు అయ్యేలాగా ప్రభు త్వాన్ని సంప్రదించగా ఎడిట్ ఆప్షన్ రాగానే సరిదిద్దేందుకు చర్యలు చేపడతామని ప్రభుత్వం తెలిపిందన్నారు కావున జిల్లా వాస్తవ్యులు ఈ విషయంపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిశాంతి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.