

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం అక్టోబర్ 14:

పాడి పరిశ్రమ అభివృద్ధికి పోషక విలువలు కలిగిన ప్రోటీన్ టోటల్ మిక్సర్ రేషన్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు.

మంగళవారం స్థానిక అమలాపురం కలెక్టరేట్ నందు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు జిల్లా సహకార శాఖ సిబ్బందితో సంయుక్తం గా సమావేశం నిర్వహించి పాల దిగుబడిని పెంచే దిశ గా మిక్స్డ్ దానా సరఫరాకై కార్యాచరణ పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోనసీమ జి ల్లాలో పాడి పరిశ్రమ అభి వృద్ధికై ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా మిశ్రమ దానాను లాభాపేక్ష లేకుండా రైతులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ముందుగా సంఘాల పరిధిలో గేదెల యూనిట్లను గుర్తించి ఆ ప్రకారం ముందుగా కంపెనీల ద్వారా ఎంపిక చేసిన టెండర్లకు అనుగుణంగా దానాలు ఆయా సహకార సంఘాలకు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు అక్కడినుంచి పాడి రైతులు కొనుగోలు చేసుకుని తమ పశువులకు పోషక విలు వలు కలిగిన దానాను అందించి అధిక పాల దిగుబడిని పొందేలా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు వ్యవసాయ యాంత్రీకరణ వచ్చిన తర్వాత పాడిప రిశ్రమ అభివృద్ధి కుంటుపడిందన్నారు.

ఈ యంత్రాల కోత వల్ల ఎండు గడ్డి దొరకని పరిస్థితి ఏర్పడి పాడి రైతు లు పశు గ్రాసం కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధిక ధరను హెచ్చించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ నేప థ్యంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి జిల్లా యం త్రాంగం ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు జిల్లాలో పాడి రైతులకు తక్కువ ధరలకు పాడి రైతులకు దాణాను అందించే దిశగా వ్యవసాయ సహ కార సహకార పరపతి సంఘాలు (ఫ్యాక్స్) ద్వారా లాభాపేక్ష లేకుండా సరస మైన ధరకు సరఫరా చేసేం దుకు కృషి చేస్తున్నామన్నారు. గోదావరి వరదలు, తుఫాన్ల సమయంలో పాడి రైతులు ఇబ్బందుల సమస్యలను పశు సంవర్ధకశాఖ అధికారులతో పలు మార్లు జిల్లా యంత్రాంగం దృష్టికి తేవడం జరిగిందన్నారు.

దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ వారు తక్కువ ధరకు నాణ్యమైన పశు దాణాను ఏ విధంగా అందించగలమ నే దానిపై పలు మార్లు చర్చలు జరిపారన్నారు. తాజా గా పశుదాణాను తయారు చేసే సంస్థలతో మాట్లాడి తక్కువ ధరకు నాణ్యమైన పశు దాణాను పాడి రైతులకు అందించేలా ఒప్పందం చేసుకుని తగిన ఏర్పాట్లు చేస్తున్నారన్నారు.

ఇప్పటికే రైతాంగానికి ఆర్థిక పరమైన సేవలందించే సొసైటీల ద్వా రా ఎరువుల విక్రయాలు జరుగుతున్నా యని ఆ సొసైటీల ద్వారానే పశు దాణాను కూడా పాడి రైతులకు అందుబాటులోకి తేవాలన్నదే తమ ఉద్దేశ్యం అన్నారు. దీనిపై సహకార సంఘ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించామన్నారు. జిల్లా లో పైలట్ ప్రాజెక్టుగా ఏడు నియోజక వర్గాల పరిధిలో తొమ్మిది ప్రాథమిక వ్వవ సాయ సహకార పరపతి సంఘాలలో సంబంధిత దాణా తయారీ పరిశ్రమ లతో ఇప్పటికే సంప్రదింపులు పెరిగాయన్నారు జిల్లావ్యా ప్తంగా ఎరువులు అధికంగా విక్రయించే 9 సొసైటీల ద్వారా దాణాను కూడా విక్రయించాలని నిర్ణయించారన్నారు.

ఈమేరకు మొదటి దశలో ఏడు నియోజకవర్గాల్లోని 9 సొసైటీల్లో పశుదాణాను ఏర్పాటుచేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసా మన్నారు. సమీకృత దాణాతో పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని పాడి పరిశ్రమ అభివృద్ధికి జిల్లా కలెక్టర్ కొత్త ఆలోచన ఫలించే విధంగా చర్చలు జరిగాయన్నారు. సమీకృత దాణాలో అన్ని రకాల మిటమిన్లతో కూడిన పదార్థాలు ఉంటాయన్నారు. 8 లీటర్లు నుంచి 10 లీటర్ల పాలిచ్చే పశువులు సమీ కృత దాణా రోజుకు 2 కిలోలు చొప్పున పెడితే సుమారు లీటరు నుంచి అరలీటరు వరకు పాలు. పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ రైతులు కోరిపల్లి సాంబమూర్తి తోపాటు జిల్లా పరిధిలో రైతులు మరియు పశుసంవర్ధక శాఖ అధికారి వెంకట్రావు డిడి కే మూర్తి, ఏడి ఉమా మహేశ్వర్ రెడ్డి సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.