డా బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ లో విద్యుత్ అంతరాయంపై కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 20:

నూతనంగా ఏర్పడిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసుల విద్యుత్ డిమాండ్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్తు టవర్లు లైన్లు ఆధునీకరణ వంటి పనుల నిర్వహణ నిమిత్తం జిల్లాలో రామచంద్రపురం డివిజన్, కొత్తపేట డివిజన్లోని ఆత్రేయపురం రావులపాలెం కొత్తపేట మండలాల్లో మినహా మిగిలిన మండలాలలో విద్యుత్ పవర్ కట్ ముందుగా నిర్దేశించిన గ్రామాలలో ఉంటుందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు.

మంగళవారం స్థానిక కలెక్టరేట్ నందు ఏపీ ట్రాన్స్కో మరియు ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించి విద్యుత్ టవర్లు ఏర్పాటు సందర్భంలో విద్యుత్ పవర్ కట్ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 90 టవర్లు వేయాల్సి ఉండగా ఇప్పటివరకు 60 టవర్లు నిర్మించినట్లు మిగిలిన 30 టవర్లు నిర్మాణానికి సంబంధించి రోజుకు రెండు చొప్పున నిర్మించనున్నట్లు తెలిపారు వీటిని నిర్మాణ సంద ర్భంలో విధించే విద్యుత్ అంతరాయ సమయాలను, గ్రామాలను ముందుగా తెలియజేయడం జరుగుతుందని ఆ మేరకు వినియోగదారుల సహకరించాలన్నారు. విద్యుత్ అంతరాయాలను ఉదయం 11 గంట నుండి 5 గంటల మధ్య సమయంలో విధించడం జరుగుతుందన్నారు.సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ మరియు కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్న నేపథ్యంలో ఈ విద్యుత్ అంతరాయాలను ప్రకటిస్తారన్నారు. స్థానిక విద్యుత్ అవసరాలలో 20 శాతం మేర ఈ యొక్క పనుల నిమిత్తం కోత విధించడం జరుగుతుందన్నారు ప్రస్తుతం జిల్లాలో ఎటువంటి విద్యుత్ అంతరాయాలు (పవర్ కట్లు) విధించలేదని ఆయన స్పష్టం చేశారు. ఏపీ ట్రాన్స్కో అధికారులు టవర్లు నిర్మాణ సందర్భంలో విధించే విద్యుత్ అంతరాయాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ముందుగాతెలియజేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. రొటేషన్ పద్ధతిలో ఎవరికి పెద్దగా ఇబ్బందులు లేకుండా ఒక సబ్ స్టేషన్లో ఉన్న నాలుగు పీడర్లు ఉంటే రోజు కొక పీడర్ చొప్పున ఒక గంట పాటు విద్యుత్ అంతరాయాన్ని విధించడం జరుగుతుందన్నారు. జిల్లా గ్రామీణ త్రాగునీటి సరఫరా విభాగానికి ఎటువంటి విద్యుత్తు అంతరాయాలను విధించరాదని 24/7 త్రాగునీటి అవసరాలకు విద్యుత్ సరఫరా ఉండాలని ఏపీ ట్రాన్స్కో ఇంజనీర్లును ఆదేశించారు. సరాసరిన కేవలం అమలాపురం డివిజన్లో మాత్రమే 24 గంటల వ్యవధిలో కేవలం 3 గంటల పాటు విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు ఏపీ ట్రాన్స్కో విశాఖపట్నం జోనల్ చీఫ్ ఇంజనీర్ బి శ్యాంప్రసాద్ మాట్లాడుతూ జిల్లా స్థాయి అవసరాల దృష్ట్యా సబ్ స్టేషన్లు ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్తు లైన్ ఆధునీకరణ వంటి పనుల నిమిత్తం విద్యుత్ అంతరాయాలను 15 రోజులు పాటు విధించడం జరుగుతుందన్నారు దీనికి విద్యుత్ వినియోగదారులు పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో ఎస్సీ ఎస్ రాజబాబు, గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ సిహెచ్ ఎన్వి కృష్ణారెడ్డి, ఇరు విభాగాల ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

మాతా రమాబాయి అంబేద్కర్ ఫౌండేషన్, లక్ష₹ విరాళాలం అందించిన ఎమ్మెల్సీ పండుల

పేపర్ ప్లేట్ మిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనందరావు V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం ఏప్రిల్ 06: అమలాపురం మండలం భట్నవిల్లి గ్రామంలో శాసనసభ్యులు ఆనందరావు పేపర్ […]

మాజీ సర్పంచ్ జంగా రాజారావు కు సతీ వియోగం V9 మీడియా చైర్మన్ వినయ్ కుమార్ పరామర్శ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం జూలై 06: మాజీ సర్పంచ్ జంగా రాజారావు కు సతీ వియోగం, V9 మీడియా చైర్మన్ వినయ్ కుమార్ పరామర్శించారు.డాక్టర్ బి […]

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు ఘన స్వాగతం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం/కాట్రేనికోన మే 31: ప్రభుత్వ, దాతల, ప్రజల భాగస్వామ్యం పి 4 ద్వారా ప్రతి ఇంటికీ అభివృద్ధి, ప్రతి జీవి తానికి ప్రగతి కొరకు […]

V9 ప్రజా ఆయుధం మీడియా కు సహకరిద్దాం!

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ప్రింట్ మీడియా సంస్థకు ఆర్థికంగా సహకరిస్తారని కోరుచున్నాము. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ఉన్న 7 నియోజకవర్గ ప్రజానీకానికి ప్రజా ఆయుధం దినపత్రిక మీ […]