మహిళ ఆరోగ్యవంతంగా ఉంటేనే కుటుంబం అంతా ఆరోగ్యం: ఆనందరావు హరీష్ మాధుర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 17:

మహిళ ఆరోగ్యవంతంగా ఉంటేనే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండి సమాజమంతా ఆనందంగా ఉంటుందనే భావనతో స్వస్థ నారి స్వస్తిక్ పరివార్ అభియాన్ కార్యక్ర మాన్ని కేంద్రం తీసుకుని వచ్చిం దని స్థానిక పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్, ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. బుధవారం స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి నందు ప్రధానమంత్రి స్వస్థ నారి స్వస్తిక్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని పార్లమెంట్ సభ్యులు హరీష్ మాధుర్ స్థానిక శాసనసభ్యులు అయితా బత్తుల ఆనందరావు లు ప్రారంభించారు.

పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా మహిళలు, పిల్లలకు సాధికారత కల్పించే లక్ష్యంతో స్వస్తి వారి సశక్తి పరివార్ అభియాన్ అనే సరికొత్త కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టార న్నారు.కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్నట్లు తెలిపారు.మహిళల ఆరోగ్య పరిరక్షణను మెరుగు పరచడం, మెరుగైన వైద్య సేవల ద్వారా కుటుంబాలను, దేశాన్ని బలోపేతం చేయడం అనే దృఢమైన లక్ష్యంతో ఈ స్కీము ను ప్రవేశ పెట్టడం జరిగింద న్నారు మహిళలు, పిల్లల ఆరోగ్య సేవలసు మరింత బలోపేతం చేయడమేనన్నారు.

కార్యక్రమంలో భాగంగా ఆయు ష్మాన్ మందిరాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సామా జిక ఆరోగ్య కేంద్రాలు, వైద్య శిబిరాలు, అదేవిధంగా అవగాహన సద స్సులు నిర్వహిస్తారన్నారు ఆరోగ్య శిబిరాల్లో పొందిన సేవల వివరాలను ఆన్లైన్లో సమయా నుసారంగా నమోదు చేస్తారని తెలిపారు.ఈ చర్యల ద్వారా ఆరోగ్యవంతమైన కుటుంబాలు, శక్తివంతమైన సమాజాలు నిర్మించాలనే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుందని తెలిపారు. ఈ శిబిరాలు మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీరుస్తానన్నారు.

ఆరోగ్యకరమైన కుటుంబాలు, సాధికారత కలిగిన సంఘాలను నిర్మించడం ఈ చర్యల లక్ష్యమన్నారు. అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ వాటాదారులు ముం దుకు వచ్చి ఈ జన్ భాగీ దారీ అభియాన్లో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు, హెల్త్, ఆయుష్మాన్ భారత్ కార్డు లతో హాజరు కావాలని వారు సూచించారు. ఆధార్ ఐడి క్రియేషన్ చేస్తూ ప్రధాన మంత్రి జనఆరోగ్య యోజన, పీఎం వందన యోజన పథకాల అవగాహన పెం పొందిస్తూ పథకాల నమోదు ప్రక్రియ చేపడతారన్నారు. ఇప్పటికే ఆధార్ ఐడి నమోదు ప్రక్రియ దాదాపుగా వచ్చిందని, త్వరలో ఆధార్ ఐడి ద్వారా హెల్త్ ప్రొఫైల్ ఆన్లైన్లో వస్తుందని, ఆప్రకారం వైద్య సేవలను మరింత సులభతరంగా అందించ వెసులుబాటు త్వరలో రానున్నదన్నారు. జిల్లావ్యా ప్తంగా 560 శిబిరాలని ఏర్పాటు చేశారని ప్రతి నియోజకవర్గంలో రోజు వారీగా ఆరోగ్య శిబిరాలు ఉంటాయన్నారు ఈ శిబిరాలలో నిపుణులైన వైద్యులు అందు బాటులో ఉండి అన్ని రకాల వైద్య సేవలను అందిస్తారని తెలిపారు. అలాగే రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించడం జరుగుతుందని, ఆడబిడ్డ పుట్టిన నాటి నుండి సంరక్షణ సేవలు బలోపేతం చేస్తూ ప్రభుత్వ ఆశయ సాధన దిశగా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్థానిక శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రధానమంత్రి స్వస్థ నారీ స్వస్తిక్ పరి వార్ అభియాన్ మహిళలు, పిల్లల ఆరోగ్య సంక్షేమం కోసం చేపట్టిన ఈ పథకం ద్వారా మహిళలు, పిల్లలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ, సదుపా యాలు, అవగాహన కల్పించడం మహిళలు, కుటుంబాలను ఆరోగ్యంగా, శక్తివంతంగా మారుస్తూ వికాసం సాధించడమే లక్ష్యంగా నిర్వహిస్తారన్నారు ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, కమ్యూ నిటీ హెల్త్ సెంటర్లు, ఇతర ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక సేవలు అందిస్తారన్నారు.శిబిరాల్లో హెల్త్ కియో స్కులు, హిమోగ్లోబిన్, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, టీబీ స్క్రీనింగ్, ప్రసూతి, పిల్లల ఆరోగ్య పరీక్షలు, రక్తదాన శిబిరాలు, పోషకా హారం, వయో వందన కార్డులు వంటి సేవలు అందిస్తారన్నారు. ఆంగన్వాడీల్లో పోషణ్ నెల ద్వారా పోషకాహారం, ఆరోగ్య అవగాహనపై బోర్డులు ప్రద ర్శిస్తారని ఆరోగ్య వంతమైన, సాధికారతతో కూడిన కుటుం బాలు నిర్మించడమే లక్ష్యంగా ప్రతి మహిళ, పిల్లలకు నాణ్య మైన ఆరోగ్య సేవలు అందించే లక్ష్యంతో ప్రజాప్రాతినిధ్యంగా ప్రభుత్వం ముందుకె ళుతోం దన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దుర్గారావు దొర డాక్టర్డు దీని ద్వారా సమా జంలో ఆరోగ్యమే శక్తి అనే భావ నను తీసుకుని వచ్చి మహిళలు కుటుంబ ఆరోగ్య సాధికారత కోసం ప్రభుత్వ ప్రధాన పురోగ మన చర్యగా ఈ పథకాన్ని తీసు కుందన్నారు.

**నేను
తల్లి, శిశువు, మరియు సమాజ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి
ఈ పోషణ నెల సందర్భంగా కట్టుబడి ఉన్నాను.తల్లి ఆరోగ్యం కోసం సరైన ఆహారం, విశ్రాంతి, మరియు ప్రేమను ప్రోత్సహిస్తా ను.శిశువుల కోసం తగిన పోషణ, తల్లి పాల ప్రాధా న్యత, మరియు శుభ్రమైన వాతావ రణాన్ని కల్పించేం దుకు కృషి చేస్తాను. ప్రకృతిని పరిరక్షిస్తూ, ఒక మొక్క అమ్మ పేరుతో” నాటి, భూమికి సేవ చేస్తాను. పిల్లల భవిష్యత్తు కోసం, ఆరోగ్యకరమైన జీవనశైలి,
పర్యావరణ పరిరక్షణ, మరియు పోషకాహారంపై అవగాహన పెంచేందుకు నా వంతు బాధ్యతను నెరవే ర్చుతాను.ఈ శపథాన్ని నిబద్ధతతో పాటిస్తూ,
పోషణతో కూడిన సమాజ నిర్మాణానికి నేను సహక రిస్తానoటు స్వస్థ నారి స్వస్తిక్ పరివార్ అభియాన్ ప్రతిజ్ఞను డాక్టర్ దుర్గారావు దొర అధి కారులు ప్రజా ప్రతినిధులతో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ లీనా , డిసిహె చ్ఎస్. డాక్టర్ కార్తీక్, రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు,అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, జనసేన నాయకులు కల్వకోలను తాతాజీ, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి అమలాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి అధికారి జయవెంకటలక్ష్మి, అశెట్టి ఆదిబాబు, ఏడిద శ్రీను, కర్రి రామస్వామి, వలవల శివరావు, దున్నాల దుర్గా, జనసేన వీరమహిళా నాగమానస, గెల్లా మీనాకుమారి, అవుపాటి గోపాల్, పేరూరి విజయలక్ష్మి, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు
అదనపు డిఎం అండ్ హెచ్ ఓ భరత్ లక్ష్మి, డి ఐ ఓ,, బి వి వి సత్యనా రాయణ ,డాక్టర్ సుమలత , ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్రావు వైద్యులుటీ కే శ్రీనివాసులు స్థానిక ప్రజాప్రతిని ధులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

లెజెండరీ డాక్టర్ కారెం రవితేజా జన్మదిన శుభాకాంక్షలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ -అమలాపురం జూన్ 22: వైద్య సేవలో అద్భుతమైన ఆరోగ్యం అందించి కరోనా సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కోనసీమ కేర్ ఎమర్జెన్సీ హాస్పిటల్ ఎండి డాక్టర్ […]

దివ్యాంగులకు పెద్దదిక్కుగా వెంకయ్య నాయుడు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అల్లవరం జనవరి 22: దివ్యాంగులకు పెద్దదిక్కుగా ఒంటెద్దు వెంకయ్య నాయుడు సాయ సహకారాలు మరువలేనిదని పరశురాముడు అన్నారు.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ […]

ప్రభుత్వ డిగ్రీ కళాశాల అమలాపురం లో రెండవ దశ అడ్మిషన్స్ ప్రారంభం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం సెప్టెంబర్ 20: డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అమలాపురం నందు రెండవ దశ డిగ్రీ […]

సోషల్ మీడియాపై కఠినమైన చర్యలు:డిఎస్పి మురళీమోహన్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు రాజోలు ఫిబ్రవరి 20: సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తే కఠినమైన చర్యలు తప్పవని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట […]