


V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 21:

అర్జీదారుల సంతృప్తి కొలమానంగా ప్రతి అర్జీకి నాణ్యతతో పరిష్కారం చూపాల్సిన బాధ్యత సంబంధిత అధికారిపై ఉందని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ నందు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీదారుల నుండి సుమారుగా 250 అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఓకే అంశంపై దరఖాస్తులు పునరావృతం కాకుండా సమస్యలను సకాలంలో పరిష్కరించా లని ఆదేశించారుగడువు దాటిన అర్జీలు లేకుండా అప్రమత్తంగా ఉంటూ నిర్దేశిత కాలవ్యవధిలో నూటికి నూరు శాతం నాణ్యతతో పరిష్కార మార్గాలు చూపాలని ఆదేశించారు. ప్రభుత్వం ఐ వి ఆర్ ఎస్ ద్వారా అర్జీదా రుల సంతృప్తి స్థాయిలను ఎప్పటికప్పుడు సేకరిస్తుం దని కావున ప్రతి సమస్యను పరిష్కరించడం ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

ప్రజల నుండి స్వీకరించిన ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్ర స్థాయిలో అధికారులు సిబ్బంది నుండి సమాచారం సేకరించి పూర్తిస్థాయిలో పరిష్కారం చూపాలన్నారు. ఆర్జీలు ఏ స్థాయిలోను పునరావృతం కాకూడదని, సమస్య పరిష్కారంతో అర్జిదారులను సంతృప్తి పరచడమే లక్ష్యంగా అధికారులు పని చేసి ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యాన్ని నేరవేర్చాలన్నారు. ప్రతి ఆర్టీకి అర్థవంతమైన సూటిగా సమాదానం ఇస్తూ పరిష్కరించాలని ఆర్జీలను ఆడి టింగ్ చేయడం జరుగుతుం దన్నారు. ఆర్జీల పరిష్కారం పై నిర్లక్ష్యం తగదన్నారు. తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే అశతో వచ్చే అర్జీదారులకు సంతృప్తికర పరిష్కారం చూపాలని, ప్రతి సమస్యను శ్రద్దగా విని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని అధికారుల ను ఆదేశించారు.

ప్రతి జిల్లా స్థాయి అధికారి ముగ్గురు బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని వారి ఆర్థిక అవసరాలను లేదా నైపు ణ్యాలను కెరీర్ గైడెన్స్ ను పెంపొందించే దిశగా చర్య లు చేపట్టాలన్నారు అదే విధంగా డివిజన్ మం డల స్థాయి అధికారులు కనీసం రెండు బంగారు కుటుం బాలను దత్తత తీసుకోవా లన్నారు. ప్రతి జిల్లా స్థాయి అధికారి ఒక వసతి గృహం గురుకుల పాఠశాలను దత్తత తీసు కొని నెలలో రెండు పర్యాయాలు సందర్శిస్తూ తమతో పాటు నియమించిన డియి స్థాయి ఇంజనీర్ సహకారంతో చిన్న తరహా మరమ్మత్తు పను లను చేపట్టాలని పెద్ద తరహా మరమ్మత్తు పనులు చేయాల్సినట్లయితే తమ దృష్టికి తెచ్చి నిధులు కోరుతూ విద్యార్థుల వసతి గృహ అవసరాలను తీర్చా లని సూచించారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సంకీర్త సవరణ ప్రక్రియను పారద ర్శకంగా నిర్వహించాలన్నా రుఓటర్ల జాబితా రూపొం దించడంలో సహ అర్హులైన యువ ఓటర్ల నమోదు దిశగా ప్రోత్సహించాల న్నారు దోషరహిత, తప్పులు లేని ఓటర్ల జాబితా రూపొందించడంలో రాజకీయ పక్షాలు అధికారు లు సమన్వయంతో అర్హు లైన యువ ఓటర్లను నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.

ఈసీఐ ఆదేశాల మేరకు ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన ఎన్నికల వ్యవ స్థను బలోపేతం చేసే లక్ష్యంతో గుర్తింపు పొందిన రాజకీయ పక్షాలు నియోజ కవర్గస్థాయి అధికారుల సహకారంతో బూత్ లెవెల్ అసి స్టెంట్లు సమన్వయం చేసుకొని అర్హులైన యువత ను ఓటర్లుగా నమోదు చేసు కునేందుకు తోడ్పాటు అందించాలన్నారు. ప్రస్తుత ఓటర్ల జాబితాలో మరణిం చినా, శాశ్వతంగా వలస వెళ్లినా వారి పేర్లను బూతు స్థాయి అధికారికి తెలియ జేయాలన్నారు.

ఓటరు జాబితాలో మార్పులు, ఓటరు కార్డులో ఏవైనా తప్పులు. ఉంటే వాటికి సంబంధించి నమోదు. చేసి, సరిచేసేందుకు సహ కరించాలన్నారు దోస రహిత తుది జాబితా ప్రచురణకు ముందు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి, డిఆర్ఓ రాజకుమారి ఎస్ డి సి కృష్ణమూర్తి, డ్వామా పిడి మధుసూదన్, సమగ్ర శిక్ష ఏ పి సి జి మమ్మీ, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.