
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -తాళ్లరేవు సెప్టెంబర్ 16:

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి హాజరయ్యారు.

స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ,డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ,చిక్కాల రామచంద్ర రావు ,చెల్లి వివేగానంద మరియు ముఖ్య నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో హరీష్ మాట్లాడుతూ నూతన కమిటీ రైతులకు పూర్తి సేవలు అందించాలని సూచించారు. సహకార సంఘాన్ని అభివృద్ధిలో నిలిపేందుకు కృషి చేయడానికి నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఎంపీ హరీష్ తెలిపారు.