
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మార్చి 08:

రాష్ట్ర ప్రభుత్వం మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నియోజక వర్గాల వారీగా కుట్టు శిక్షణా కేంద్రాలను ప్రారంభించిందని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం స్థానిక శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు తెలిపారు. ఈ మేరకు శనివారం స్థానిక కోనసీమ మహిళా సమైక్య కార్యా లయము నందు కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు తమ కాళ్ళపై తమ నిలబడి జీవనోపాదులు పొందుతూ కుటుంబాలను పోషించుకునే స్థాయికి చేరుకోవాలని సంకల్పం తో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రారంభించిందని 90 రోజులు శిక్షణ అనంతరం 75% హాజరు ఉన్న మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు అందిస్తారని కుట్టు శిక్షణలో ఏ మేరకు శిక్షణ పొందింది పరీక్షలు కూడా నిర్వహి స్తూ వారి సామర్థ్యాలను పరిగణనలో తీసుకొని వారికి అవసరమైన మల్టీపర్పస్ కుట్టుమిషన్లు కూడా అందించేందుకు దశలవారీగా చర్యలు చేపట్టనుందన్నారు.

బీసీ సంక్షేమం సహకార సంఘాల ఆధ్వర్యంలో ఆర్య వైశ్య రెడ్డి క్షత్రియ కమ్మ బ్రాహ్మణ మరియు సామాజిక వర్గాలలో వెనుకబడిన వర్గాల మహిళలను ఎంపిక చేసి నిష్ణాతులైన వారితో శిక్షణ కార్యక్రమాలు నియోజక వర్గాల వారీగా నిర్వహిం చడం జరుగుతుందన్నా రు. జిల్లాలో 3243 మంది మహిళలకు శిక్షణను ఇవ్వాలని ప్రభుత్వ లక్ష్యంగా నిర్దేశించింద న్నారు ఈ మేరకు చర్యలు వేగవంతం చేయాలని ఆయన అధికారులకు సూచిం చారు ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రమేస్ అమ్ముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయు డు మెట్ల రమణబాబు తదితరులు పాల్గొన్నారు.