


V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 05:

పని ఒత్తిడిని అధిగమించి నిజమైన మనశ్శాంతిని సాధించడానికి సంతోష కరమైన, ఉపయోగకర మైన జీవితాన్ని గడపడానికి విపశ్యన సాంకేతికత సరళమైన, ఆచరణాత్మక మార్గమని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అన్నా రు. శనివారం స్థానిక కలెక్టరేట్ నందు విపశ్యన ధ్యాన కార్యక్రమంపై ఎంఈఓ లు హెచ్ఎం లతో అవగాహన సదస్సు నిర్వహించి పాఠశాలల్లో పిల్లలకు వయసుల వారీగా విపశ్యన ధ్యాన కార్యక్రమాల నిర్వహణ విధివిధానాలపై చర్చించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాలానుగుణంగావిపశ్యన మనస్సును శుద్ధి చేయ డం ద్వారా, బాధల నుం డి లోతైన కారణాల నుండి విముక్తి పొందడం ద్వారా శాంతి సామర స్యాన్ని అనుభవిం చడానికి వీలుకల్పిస్తుందన్నారు. ఈ ధ్యానం దశల వారీగా, అన్ని మానసిక కల్మషాల నుండి పూర్తి విముక్తి అనే అత్యున్నత ఆధ్యాత్మిక లక్ష్యానికి దారితీస్తుందన్నారు.

విపశ్యన ధ్యానం ప్రక్రియను అన్ని వయ సుల వారు ఎక్కడైనా ఎప్పుడైనా ఆచరించవ చ్చునన్నారు.విపశ్యన భారతదేశ అత్యంత పురాతన ధ్యాన పద్ధ తుల్లో ఒకటన్నారు. విద్యార్థులు విపశ్యనను అభ్యసించడం ద్వారా చదువుల ఒత్తిడి నుండి విముక్తి పొందుతూ జీవితంలోని అన్ని రంగాలలో ఉన్నత స్థాయిలను సాధించి ఉత్సాహ భరితమైన ప్రభావాన్ని చూపింద న్నారు. ప్రస్తుతం 8 వసతి గృహ పాఠశాలల్లో ప్రయో గాత్మకంగా విపశ్యన ధ్యాన కార్య క్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

జిల్లాలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యా యులు ఎంఈఓ లు వ్యక్తిగత శ్రద్ధతో విపశ్యన ధ్యాన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థినీ విద్యార్థులను వయసుల వారీగా విభజిస్తూ ప్రతిపా దనలను ఆగస్టు 15 నాటికి సిద్ధపరచి డీఈఓ ద్వారా సమర్పించాల న్నారు సూచించారు తదుపరి 7 నుండి 10 తరగతుల విద్యార్థులకు పాఠశాల తరగతి గదుల లోనే ధ్యాన కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్య లు చేపట్టడం జరుగుతుం దన్నారు. ప్రతి పాఠశాల లో పబ్లిక్ అడ్రస్ సిస్టం మౌలిక సదుపా యాలు కల్పనకు తప్పని సరిగా విపశ్యన ధ్యాన కార్యక్ర మాలలో ఉండేలా సి ఎస్ ఆర్ నిధులను సమకూ ర్చుకోవాలన్నారు.

ప్రతి ఉద్యోగి ఉదయం సాయం త్రం 4 నెలలపాటు శిక్షణ ఇచ్చి విద్యార్థు లు పని ఒత్తిడిని బద్దకా న్ని అధిగమించి మానసిక ప్రశాంతత పొంది చదు వులో చురుకుదనాన్ని చూపుతున్నది లేనిది బెరీజు వేస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కొరకు బాటలు వేయాల న్నారు మహారాష్ట్రలో సుమారు రెండున్నర కోట్ల మంది విద్యార్థులు విపశ్యన ధ్యాన గురువుల ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.

ఇప్పటికే జిల్లాలోని విలస, కే గంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విపశ్యన ధ్యాన కార్యక్ర మాల నిర్వహణకు ముందుకు వచ్చేయన్నారు. దశలవారీగా పిల్లలను ధ్యాన కార్యక్ర మాలలో పాల్గొనేటట్లు దశలవారీగా ప్రయత్నిం చాలన్నారు.విపశ్యన ధ్యాన గురువు వాణి మాట్లాడుతూ జిల్లాలో 8 రెసిడెన్షియల్ పాఠశాలలో మిత్ర కార్యక్రమం ద్వారా 2700 మంది విపశ్యన ధ్యాన యోగ కార్యక్ర మాలలో శిక్షణ పొందుతున్నారన్నారు.

ఉచితం గా ఈ యొక్క కార్యక్రమా లు నిర్వహణకు పూర్తిగా సహకరించడం జరుగు తుందని ఆయన స్పష్టం చేశారు. ముందుగా వ్యాయామ ఉపాధ్యా యులు పీఈటీలు పీడీలు ఉపాధ్యాయులకు శిక్షణ పొంది తదుపరి పిల్లలకు తర్ఫీదును ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలోవిపశ్యన ధ్యాన యోగ గురువులు లక్ష్మయ్య, నాగార్జున జిల్లా సైన్స్ అధికారి జి వి ఎస్ సుబ్రహ్మణ్యం ఎంఈఓలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
