చెన్నై రైల్వే స్టేషన్ లో చిక్కుకుపోయిన కుటుంబాన్ని కాపాడిన జాయింట్ కలెక్టర్

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాంతి ఐఏఎస్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 06:

చెన్నై రైల్వే స్టేషన్లో చిక్కుకుపోయిన కుటుంబాన్ని కాపాడిన జాయింట్ కలెక్టర్

మానవత్వాన్ని నిరూపించుకున్న జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాంతి

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
అమలాపురం చెందిన శారీరక వైకల్యం గల నాగేశ్వరరావు అనే వ్యక్తి శంకర్రావు అనే వ్యక్తి చేతిలో ఉద్యోగం కోసం మోసపూరితంగా నమ్మించి నమ్మకద్రోహం చేశాడు. నాగేశ్వరావు
ఉద్యోగం అవకాశమంటూ చెన్నైకు తీసుకెళ్లి ,ఆయన దగ్గర నుండి డబ్బులను తీసుకొని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో అతని భార్య,చిన్న పిల్లలతో వదిలేసి పరారయ్యాడు.
ఈ మోసాన్ని కి గురైన నాగేశ్వరరావు, తన పరిస్థితిని జిల్లా జాయింట్ కలెక్టర్ టీ.నిషాంతి ఐఏఎస్ ను సెల్ ఫోన్ ద్వారా వివరించాడు. భార్య, పిల్లలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయాడు.ఈ విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ మానవతా దృష్టితో స్పందించి, తక్షణమే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఆర్‌పీఎఫ్ సిబ్బందితో సమన్వయం చేసి నాగేశ్వరరావు కుటుంబానికి రైలు టిక్కెట్లు, ప్రయాణ సౌకర్యాలను ఏర్పాటు చేయించారు. అంతేగాక, అవసరమైన ఖర్చుల కోసం తన సొంత డబ్బును పంపించి ఆ కుటుంబానికి మానవతా హస్తం అందించారు. ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయిన ఇలాంటి మానవతా దృక్పథంతో విధులు నిర్వహిస్తూ పేద ప్రజల మనసుకు దగ్గరవుతున్న అధికారులు అతి తక్కువ మందే ఉంటారు అని బాధిత కుటుంబ సభ్యులు అంటున్నారు.

Related Articles

అమలాపురంలో ప్రజా వేదిక లో 210 అర్జీలు స్వీకరించిన కలెక్టర్ రెట్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 27: సు పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసే ఉద్దేశ్యంతో ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత […]

అమలాపురంలో డంపింగ్ యార్డుకు భూసేకరణ చర్యలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం జనవరి 18: అమలాపురం పట్టణం మరియు పరిసర గ్రామాలలోని ఘన ద్రవ పదార్థాల వ్యర్థా లను డంపింగ్ యార్డుకు తరలించి రీసైక్లింగ్ […]

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ను అవమానపరిచిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులపై చర్యలు తీసుకోవాలి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అమలాపురం ఆగస్టు 26: రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి కొత్త జిల్లా పేరును డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు […]

లిడియా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రావులపాలెంలో క్రిస్మస్ వేడుక.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రావులపాలెం డిసెంబర్ 18: ఆంధ్ర యూనివర్సిటీ అనుబంధం లిడియా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రావులపాలెం లో బుధవారం రాత్రి ఘనంగా క్రిస్మస్ వేడుకలు మేనేజ్మెంట్ […]