
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అంబాజీపేట సెప్టెంబర్ 06:
క్రాఫ్ట్ టీచర్ రాజేశ్వరి ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు అందుకున్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం తొండవరం’ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు క్రాఫ్ట్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న
పెయ్యల రాజేశ్వరి కు మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. ఈ అవార్డును స్థానిక మండల విద్యాశాఖ అధికారులు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థులు తోటి ఉపాధ్యాయలు రాజేశ్వరి ను పూలమాలలు,శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం మెమెంటో తో పాటు ఆమె ముఖ చిత్రపటాన్ని పెయింటింగ్ తో గీసి ఆమెకు అందజేశారు. మండల విద్యాశాఖ అధికారులు కాండ్రేకుల. వెంకటేశ్వరరావు, మోకా ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, రాష్ట్ర జలవనరుల శాఖ డైరెక్టర్ శిరిగినీడి వెంకటేశ్వరరావు, మాచవరం సర్పంచ్ నాగాబత్తుల శాంత కుమారి సుబ్బారావు, ప్రధానోపాధ్యాయులు పి వి. కేసవా చార్యులు ఎంపిటిసి సభ్యులు వి దొరబాబు, వడ్లమాని పద్మావతి, అంబాజీపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొర్లపాటి వెంకటేశ్వరరావు సొసైటీ చైర్మన్ సూరిబాబు తదితరులు పాల్గొని అవార్డు గ్రహీతను ఘనంగా సన్మానించారు.