అమలాపురంలో ప్రజా వేదిక లో 210 అర్జీలు స్వీకరించిన కలెక్టర్ రెట్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 27:

సు పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసే ఉద్దేశ్యంతో ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, ఈ కార్యక్రమం ద్వారా అందే ప్రతి ఆర్జీని నిర్దిష్ట గడువులోగా అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు.సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి భవన్ నందు జిల్లాస్థాయిలో నిర్వహించిన పిజిఆర్ఎస్ జిల్లాస్థాయిలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారులను మర్యాదపూర్వకంగా పలకరించి వారి సమస్యలను సావధానంగా విని అందుబాటులో ఉన్న సంబంధిత అధికారులకు వివరించి పరిష్కారానికి చర్యలు గైకొనాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి డిఆర్ఓరాజకుమారి, డి ఆర్ డి ఏ శివశంకర్ ప్రసాద్, డ్వామా పథక సంచాలకులు మధుసూదన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎస్ త్రినాధరావు కృష్ణ మూర్తి అర్జీదారుల నుండి సుమారుగా 210 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కార కొరకు క్షేత్రస్థాయి అధికారులతో నిరంతర సమన్వయం అవసరమన్నారు. ఆర్జీ అందిన వెంటనే క్షుణంగా పరిశీలించి, సంబంధిత అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకొంటూ నాణ్యతతో పరిష్కరించాలని సూచించారు. పీజీఆర్ఎస్ ఆర్జీల తోపాటు స్వర్ణాంధ్ర విజన్, రెవిన్యూ సమస్యలు నైపుణ్యాభివృద్ధి తదితరాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రాధాన్య పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో జిల్లాను ముందు నిలిపేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.

ఎప్పటికప్పుడు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి అధికారులను సమన్వయం చేసుకోవాలన్నారు. అర్జీల పరిష్కార ప్రక్రియ పెండింగ్ లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రతి సమస్యకు నాణ్యతతో అర్జీదారులు సంతృప్తి ధ్యేయంగా పరిష్కరిస్తూ పీజిఆర్ఎస్ నిర్వహణ తీరు పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ విపత్తులు నిర్వహణకు సంబంధించి వివిధ శాఖల సమన్వయంతో జియో కోఆర్డినేటర్స్ తో మ్యాపులను రూపొందించాలని ఆదేశించారు. రోడ్లు కాలువలు డ్రైనేజీలు, విద్యా సంస్థలు, వాటర్ ట్యాంకులు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు సైక్లోన్ పునరావాస కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు సబ్ స్టేషన్లు, తదితర అంశాలపై మ్యాపులను చిత్రీకరించాలని ఆదేశించారు.

ఈనెల 28వ తేదీన మధ్యాహ్నం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం వద్ద స్వామివారి తిరుకల్యాణోత్సవాలు సంబంధించి జిల్లాస్థాయి అధికారులతో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారులు, వికాస జిల్లా మేనేజర్ జి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

ఆత్మకూరులో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి

ఆంధ్రప్రదేశ్ నంద్యాల ఆత్మకూరులో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందారు.అతిసారతో మరొకరి పరిస్థితి విషమం మారింది. మరో ముగ్గురు బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ సీరియస్ గా […]

మస్కట్ లో చిక్కుకున్న సవరపు రామలక్ష్మి (విలస)

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జులై 3: మస్కట్ లో చిక్కుకున్న అయినవిల్లి మండలం విలస గ్రామానికి చెందిన సవరపు రామలక్ష్మి స్వదేశానికి తీసుకురావాలన్న విన్నపంపై స్పందించిన కోనసీమ […]

అమలాపురం ప్రజా వేదికకు 150 అర్జీలుసమస్యలు పరిష్కరించాలి కలెక్టర్ ఆదేశం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం అక్టోబర్ 06: ప్రజలనుంచి వస్తున్న అర్జీలు పునరావృతం కాకుండా. అధికారులు సత్వరమే పరిష్కరించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా […]