అమలాపురంలో డంపింగ్ యార్డుకు భూసేకరణ చర్యలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం జనవరి 18:

అమలాపురం పట్టణం మరియు పరిసర గ్రామాలలోని ఘన ద్రవ పదార్థాల వ్యర్థా లను డంపింగ్ యార్డుకు తరలించి రీసైక్లింగ్ కు వీలుగా అవసరమైన భూమి సేకరణ కు చర్యలు చేపట్టాలని స్థానిక మున్సిపల్ అధికారులను అంబేద్కర్ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం లో భాగం గా స్థానిక పట్టణ పరిధి లోని 29వ వార్డు నందు ఈదరపల్లి బైపాస్ రోడ్లో గల డంపింగ్ యార్డును ఆయన స్థానిక శాసనసభ్యులు మరియు అమ్ముడా చైర్మన్, మునిసిపల్ అధికారులతో కలిసి పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెత్తా చెదా రాలను ఎప్పటి కప్పుడు క్లీన్ చేస్తూ వ్యర్ధాలను విభ జిస్తూ రీసైక్లింగ్ కు చర్యలు చేప ట్టాలని చెత్తాచెదారాలను తగలబెడితే పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని చెత్తాచెదారాలను తగులు పెట్టరాదని పట్టణ పారిశుద్ధ్య అధికారులను ఆదేశించారు. పట్టణానికే కాకుండా చుట్టు పక్కల పరిసర గ్రామాల నుండి వచ్చే వ్యర్ధాలను కూడా స్థానికంగా డంపింగ్ చేసి రీసైక్లింగ్ చేసేందుకు అను వైన విధంగా అదనంగా భూసేకరణ చేపట్టాలని ఆదేశించారు. ప్రాసెసింగ్ రీసైక్లింగ్ కొరకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను మున్సిపల్ అధికారులు రూపొందించి సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్య క్రమంలో స్థానిక శాసన సభ్యులు ఎ ఆనందరావు, అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధ్యక్షులు అల్లాడ స్వామి నాయుడు మున్సిపల్ కమిషనర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

నిపుణులతో మధ్యాహ్న భోజన పథకాన్ని రూపొందించారు: ఎమ్మెల్యే ఆనందరావు

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంతోమంది నిపుణులతో మధ్యాహ్న భోజన పథకాన్ని రూపొందించారు: ఎమ్మెల్యే ఆనందరావు V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం జనవరి 4: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ […]

v9 ప్రజాయుధం దినపత్రిక

ఘోర అగ్ని ప్రమాదం

రాజస్థాన్‌ జయపురలో ఘోర ప్రమాదంగ్యాస్ ట్యాంకర్‌లో చెలరేగిన మంటలుఆరుగురు మృతి, పలువురికి గాయాలుఅగ్నిప్రమాద ఘటనలో 40కిపైగా వాహనాలు దగ్ధం

ఓఎన్జిసి ఇతర చమురు సహజ వాయువుల నిక్షేపాల వెలికితీత

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 10: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సముద్ర తీరం వెంబడి ఓఎన్జిసి ఇతర చమురు సహజ వాయువుల నిక్షేపాల వెలికి […]