రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ను అవమానపరిచిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులపై చర్యలు తీసుకోవాలి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అమలాపురం ఆగస్టు 26:

  • జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందించిన దళిత ఐక్యవేదిక

రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి కొత్త జిల్లా పేరును డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టి రెండు సంవత్సరాలు గడిచినా గాని కొంతమంది కుల పిచ్చి ఉన్న జిల్లా స్థాయి అధికారులు ఉద్దేశపూర్వకంగా రాజ్యాంగ నిర్మాతను గౌరవించకుండా డాక్టర్ అంబేద్కర్ పై విషం గక్కుతూ ఆయన పేరు ఉపయోగించకుండా కేవలం కోనసీమ జిల్లా పేరుతో ఆదేశాలు జారీ చేస్తున్నారని అందులో భాగంగానే వినాయక చవితి సందర్భంగా జిల్లా కాలుష్య నియంత్రణ మండలి మట్టి గణపతి విగ్రహాలు ఉపయోగించాలని ముద్రించిన గోడ పత్రికలో డాక్టర్ అంబేద్కర్ పేరు ఉపయోగించకుండా కోనసీమ జిల్లా అని ముద్రించి ప్రజలకు పంచారని గతంలో కూడా ఇదే శాఖాధికారులు డాక్టర్ అంబేద్కర్ ను అవమానించేలా చాలా సందర్భాల్లో కరపత్రాలు గోడపత్రికలు ముద్రించారని కావున ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి కుల దురహంకారంతో వ్యవహరిస్తున్న జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శంకర్రావు మరియు అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీ ప్రణీత తదితర అధికారులపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలని వీరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా దళిత ఐక్యవేదిక అధ్యక్షులు డిబి లోక్ కన్వీనర్ జంగా బాబురావు కార్యదర్శి ఇసుకపట్ల రఘుబాబు కోకన్వీనర్ రేవు తిరుపతిరావు లు మంగళవారం జిల్లా కలెక్టర్ రావిలాల మహేష్ కుమార్ ను కలసి వినతిపత్రం అందించారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉద్దేశపూర్వకంగా డాక్టర్ అంబేద్కర్ పేరును అవమానిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు దీనిపై కలెక్టర్ స్పందిస్తూ మరొకసారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు

Related Articles

అల్లు అర్జున్ కు జూనియర్ ఎన్టీఆర్& ప్రభాస్ కాల్

సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో అరెస్టై బెయిల్ పై విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ ఫోన్లో పరమర్శించారు. అరెస్ట్ […]

ఎమ్మెల్యే ఆనందరావు బుధవారం పర్యటన షెడ్యూల్ ఇలా !

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం సెప్టెంబర్ 16: అమలాపురం నియోజకవర్గం శాసనసభ్యుడు అయితాబత్తుల ఆనందరావు బుధవారం నాడు పర్యటన షెడ్యూల్ వివరాలు ఈవిధంగా…ఉన్నాయి •ఉదయం 10 గంటలకు […]

అసెంబ్లీలో గందరగోళంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా ! ఎంటీ ?

తెలంగాణ అసెంబ్లీలో జరిగిన గందరగోళంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మంత్రి శ్రీధర్ బాబును అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సభలో సభ్యుల […]

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజి ఆర్ఎస్) దరఖాస్తులకు 266 అర్జీలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఏప్రిల్ 21: ప్రతి అర్జీదారుడు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేలా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజి ఆర్ఎస్) దరఖాస్తుల పరిష్కారం ఉండాలని […]