
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం ఆగస్టు 22:

అమలాపురం ప్రైవేట్ డ్రైవర్ యూనియన్ నాయకులు ఆధ్వర్యంలో” జయహో రథసారథి” పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రైవేట్ డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు మందారామకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం అమలాపురం టౌన్ త్రీరత్న బుద్ధ బుద్ధ విహార్ సమీప టాక్సి స్టాండ్ నందు జయహో రథసారధి ఏర్పాటు చేశారు.
కార్యక్రమానికి ఉత్తర కోస్తా జిల్లాలు అధ్యక్షులు వాసు యేలేటి, ఆనంద్ గార్లు విచ్చేశారు. జయహో రథసారధి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వక్తలు వివరించారు. డ్రైవర్లు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ వస్తున్నారని, అనేక ప్రమాదాలకు గురై కుటుంబాలు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి ప్రభుత్వాలు ఆటో డ్రైవర్ని గుర్తించినట్లుగా ప్రైవేట్ డ్రైవర్లు గుర్తించి సాయ సహకారాలు అదించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమలాపురం పట్టణ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరబాబు ను ఆహ్వానించి సత్కరించారు.అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి సత్యానందం, దంగేటి దుర్గాప్రసాద్, మందా దుర్గారావు, రత్నాజీ, దొరబాబు, రాఘవేంద్రర్, వాసు, రామారావు, రాఘవేంద్ర కుమార్, తదితరులు పాల్గొన్నారు.