
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 22:
అమలాపురం డిప్యూటీ ఎంపీడీవో మంగాదేవి ఆకస్మిక మృతి పై పంచాయతీరాజ్ ఉద్యోగులు దిగ్భ్రాంతి చెందారు.
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఇంచార్జ్ ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తున్న మహిళా పంచాయతీరాజ్ అధికారి బడుగు మంగాదేవి శనివారం అకస్మాత్తుగా మృతి చెందారు. ఆమె మరణ వార్త విని తోటి పంచాయతీరాజ్ ఉద్యోగస్తులు కన్నీటిపరమయ్యారు.ఆమె విధులు నిర్వహణలో ఆమెకు సాటి ఎవరూ లేరని గుర్తి చేసుకున్నారు. మంగాదేవి నీతి నిజాయితీకి మారుపేరుని, మంచి స్నేహశీలి వివాదరహితురాలుగా పేరు పొందారు. అమలాపురం ఎస్కిబిఆర్ కాలేజీలో డిగ్రీ పొంది కాకినాడ లో పీజీ పూర్తి చేసి 1996 సంవత్సరంలో గ్రూప్2 ఆఫీసుగా ప్రభుత్వ ఉద్యోగం సాధించి. 1997 లో మొట్ట మొదటిసారిగా చెయ్యరు గ్రామపంచాయతీ ఎగ్జిక్యూటివ్ అధికారిగా మంచి సేవలందించి మంచి పేరు తెచ్చుకున్నారు. కాట్రేనికోన,మలికిపురం,ఈదరపల్లి, పంచాయతీ కార్యదర్శిగా పని చేశారు. అంబాజీపేట, మల్కిపురం ఈ ఓ పిఆర్డి గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం అమలాపురం ఇంచార్జ్ ఎంపీడీవో గా నిర్వహిస్తున్న క్రమంలో శనివారం అకస్మాత్తుగా ఆమె మరణించారు. మంగాదేవి అకాల మరణానికి సహసర ఉద్యోగస్తులతో పాటు రాజకీయ నాయకులు, వివిధ ప్రజా సంఘ ఉద్యమ నాయకులు సంపాపం తెలిపారు.