
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం 21:

ఎపి అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) అద్వరంలో అమలాపురం మండలం తాసిల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా చేసి విన్నపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ మాట్లాడుతూ… అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి,FRS రద్దుచేయాలని, గ్రాట్యూటీ ఇవ్వాలని ఆగస్టు 21న దేశ వ్యాపితంగా అఖిల భారత అంగన్వాడీ యూనియన్ బ్లాక్ డే నిర్వహించాలని నిర్ణయించింది. అఖిల భారత పిలుపులో భాగంగా అమలాపురం ప్రాజెక్ట్ పరిధిలో మూడు మండలాలు నిరసనలు జరిగాయి. అంగనవాడి వర్కర్స్ సంబంధించి న్యాయమైన డిమాండ్స్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం 2014 నుండి అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదు. మన రాష్ట్రంలో 2019 నుండి వేతనాలు పెంచలేదు. ఈ కాలంలో పనిభారం పెరిగింది. 42 రోజులు చారిత్రాత్మక సమ్మె సందర్భంగా 2024 జూలైలో వేతనాలుపెంచుతామని మినిట్స్ ఇచ్చారు. అయినా ఇంత వరకు రాష్ట్ర ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవటం లేదు. అంగన్వాడీ సెంటరు నిర్వహణకు ఇచ్చిన పోన్లు పోషణట్రాక్టరు, బాలసంజీవిని యాప్సు అమలుకు సపోర్ట్ చేయటంలేదు. లబ్ధిదారులు కు పోటోక్యాప్చర్,ఓటిపి,FRS ద్వారా నే సరుకులు ఇవ్వాలని పెట్టిన నిబంధన అమలు చేయటానికి అంగన్వాడీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సరుకులు అన్ని ఒక్కసారి గా రావటంలేదు. నెట్ సిగ్నలేకపోవడం, సర్వర్లు పనిచేయకపోవడంవలన లబ్ధిదారులందరూ ఇబ్బందులు పడుతున్నారు.కావున యాప్ లు అన్ని కలిసి ఒక యాప్ గా మార్పుచేయాలని, FRS, ఇన్, అవట్ రద్దు చేయాలని, సెంటరు నిర్వహణకు ట్యాబుల్ ఇవ్వాలని 5జి నెట్ ఇవ్వాలని ,ప్రధాన మంత్రి మాతృ వందనం పధకం నీ కొత్తగా అంగన్వాడీలు అప్పగించరాదు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి, మినీలును మెయిన్ వర్కర్లు గామార్చుతూ జీవో ఇవ్వాలని, గ్రాడ్యుటి జీవోలో మార్పులు చేయాలని, హెల్పర్లు ప్రమోషన్ లకు గైడ్లైన్స్ రూపొందించాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కలగజేసుకుని అంగన్వాడీ యూనియన్స్ రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో P. అమూల్య. దుర్గ. పార్వతి. మణి మాల. విజయ ఉమా తదితరులు నాయకత్వం వహించారు.