ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన కన్న కూతురు

మండపేట మార్చి 21 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,మండపేటలో దారుణం జరిగింది. కూతురి వివాహేతర సంబంధం తండ్రి రాంబాబుకు తెలియడంతో కూతురు వెంకట దుర్గను మందలించాడు. దీంతో కోపోద్రిక్తురాలైన ఆమె రామచంద్రపురం కొత్తూరుకు చెందిన ప్రియుడు సురేష్తో కలిసి తండ్రి హత్యకు పథకం వేసింది. ఈ నెల 16న తండ్రి ఒంటరిగా ఉన్న సమయం చూసి ప్రియుడుకు సమాచారమివ్వడంతో తన స్నేహితుడితో వచ్చి ముగ్గురూ కలిసి హత్య చేశారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు విశాఖపట్నం పారిపోతున్న ముగ్గురినీ అరెస్ట్ చేసి విచారణలో నేరం అంగీకరించడంతో గురువారం రామచంద్రపురం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

Related Articles

ఠాణేలంక గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గా పాటి శకుంతల సన్మానించిన పేరెంట్స్ కమిటీ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరంజులై 25: ఠాణేలంక గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గా పాటి శకుంతల నూతనంగా బాధ్యతలు చేపట్టారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల […]

పేద వర్గాలకు ప్రధానమంత్రి జన ఔషధ కేంద్రాలు ఒక వరం: MLA ఆనందరావు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం మార్చి 07, ఆర్థిక భారంతో మందులు కొనలేని పరిస్థితులలో ఉన్న పేద వర్గాలకు ప్రధానమంత్రి జన ఔషధ కేంద్రాలు ఒక వరంగా మారాయని […]

30 తేదీలు31…331.84 ₹ కోట్ల మద్యం తాగేశారు!

ఆంధ్రప్రదేశ్: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. ధరలు తగ్గడంతో మందుబాబులు కేసులకు కేసులు ఖాళీ చేశారు. డిసెంబర్ 30, 31 తేదీల్లో రూ.331.84కోట్ల బిజినెస్ జరిగింది. 30న రూ.219.43 […]

మత్స్యకార కుటుంబానికి 20 వేలు భరోసా విడుదల

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- ముమ్మిడివరం జనవరి 03: రానున్న ఏప్రిల్ ఒకటో తేదీన ఇటీవల క్యాబినెట్లో పెంచి ప్రకటించిన రూ 20 వేల మత్స్యకార భరోసా నిధులు అందించి […]