వడ్రంగి కార్మికులకు అండగా ఉంటా..ఆదుకుంటా..ఏ సమస్య వచ్చినా నేరుగా నాకు ఫోన్ చేయండి

కార్మికుల సంక్షేమానికి నా తొలి ప్రాధాన్యతరాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –అమలాపురం, జూలై 30:

రాష్ట్రంలో కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని, అలాగే వడ్రంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్(వడ్రంగి)అసోసియేషన్ 8వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవసభ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ అమలాపురం వాసర్ల గార్డెన్స్ లో బుధవారం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ వడ్రంగి మేస్త్రిలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానన్నారు. ఏ కార్మికుడికి కష్టం వచ్చినా నేరుగా తనకు ఫోన్ చేయవచ్చని నిండు సభలోనే తన ఫోన్ నెంబర్ను కార్మికులకు ఇచ్చారు. వడ్రంగి పని చక్కటి వృత్తి నైపుణ్యంతో కూడుకున్నదని, పనికి తగిన వేతనం, వారి జీవన విధానం మెరుగు పడేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సభకు రాష్ట్రం నలుమూలలనుండి, ఆయా జిల్లాల,మండలాల అధ్యక్షులు హాజరై నూతన అధ్యక్షుడి, కమిటీ కార్యవర్గ సబ్యులును ఎన్నుకొని ప్రమాణస్వీకరాలు చేశారు. రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా తాటికొండ రంగబాబు, ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి, ఉపాధ్యక్షులు గణాల సత్యసాయి ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మంత్రి సుభాష్ దృష్టికి వడ్రంగి కార్మికులు, మేస్త్రులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు తీసుకువచ్చారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సుభాష్ ప్రభుత్వ పరంగా కార్మికులను అన్ని విధాల ఆదుకుంటామన్నారు. వడ్రంగి మేస్త్రుల అసోసియేషన్ కు ఉమ్మడి జిల్లాలో భవనం ఉండేదని, కోనసీమ జిల్లాలో కూడా కమ్యూనిటీ హాలు మంజూరు చేయాలని కోరటంతో వడ్రంగి అసోసియేషన్ బిల్డింగ్ మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే కార్మికుల విజ్ఞప్తి మేరకు వడ్రంగులకు ప్రత్యేక కార్పొరేషన్ విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా మంత్రి సుభాష్ హామీ ఇచ్చారు.

Related Articles

ప్రతి అక్షరం ప్రజా ఆయుధం

V9 ప్రజా ఆయుధం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా

మీడియాకు 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం,జనవరి 25,2025 జనవరి 26 ,ఆదివారం 76 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ […]

11వ అంతర్జాతీయ యోగ దినోత్సవం/అమలాపురం ఎమ్మార్వో/ ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు

అమలాపురం ఎమ్మార్వోకు యోగ అవార్డు లభించింది. V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 25: రాష్ట్ర ప్రభుత్వం 11వ అంతర్జాతీయ దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన యోగాంధ్ర మాసోత్సవాలలో భాగం […]

గుత్తుల శ్రీరామమూర్తి పార్థివ దేహం:జెడ్పిటిసి గన్నవరపు శ్రద్ధాంజలి

క్రాప శంకరయ గూడెం ఎంపీటీసీ సభ్యులు గుత్తుల శ్రీరామ్ మూర్తి అకాల మరణానికి గురయ్యారు. ఆయన పార్ధీహానికి అయినవిల్లి మండలం జడ్పిటిసి సభ్యులు గన్నవరపు శ్రీనివాసరావు సోమవారం దర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కుటుంబానికి […]