
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం ఆగస్టు 21:
మాత రమాబాయి అంబేద్కర్ ఫౌండేషన్ చైర్ పర్సన్ రజిని,ఎమ్మెల్యే ఆనందరావు పరామర్శించారు .
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాత రమాబాయి అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా పుణ్యవత్తుల రజిని దళిత బహుజన సామాజిక వర్గానికి ఉత్తమ సేవలు అందిస్తున్నారు. ఆమె అనారోగ్యం కారణంగా ఇటివల శస్త్ర చికిత్స చేయించుకుని వైద్యుల సలహా మేరకు ఇంటి వద్ద విశ్రాంతి పొందుచున్నారు. ఈరోజు గురువారం అనాతవరం గ్రామ పంచాయతీ భట్నవిల్లి ఆమె స్వగ్రామందు అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు పరామర్శించి ఆరోగ్య విషయాలు అడుగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ఆరోగ్య నియమాలు పాటిస్తూ.. త్వరగా కోలుకోవాలని ఆయన రజనీను ధైర్యపరిస్తారు. కార్యక్రమంలో ఆయన వెంట కూటమి నాయకులు పాల్గొన్నారు.