అమలాపురం కలెక్టరేట్ ప్రజా వేదికకు 165 ఆర్జీలు: స్వీకరించిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్ డి ఆర్ వో లు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం డిసెంబర్ 30:

అర్జీదారుల నుంచి స్వీకరించిన ఫిర్యాదులకు అధికారులు జవాబు దారీగా ఉండాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాoతి, డి ఆర్ డి ఏ, డ్వామా ఐసిడిఎస్ పి డీ లు డాక్టర్ వి శివ శంకర ప్రసాద్,ఎస్ మధుసూదన్, ఎం ఝాన్సీరాణిలు అర్జీదారుల నుండి సుమారుగా 165 ఫిర్యాదులు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మీకోసం నోడల్ అధి కారులు సకాలంలో సమస్యలు పరిష్కరించే దిశగా పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. సుపరిపాలనే లక్ష్యంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ప్రజాసమస్యల పరిష్కార వేదిక మీకోసం ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారంపై నోడల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. తొలుత పీజీఆర్ఎస్ కార్యక్రమానికి సంబంధించి రిసెప్షన్, సమాచార కౌంటర్తో పాటు రిజిస్ట్రేషన్, హెల్ప్ డెస్క్, దివ్యాంగుల అర్జీల స్వీకరణ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.


మండల స్థాయి ప్రజా సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు
మండల, డివిజన్ స్థాయిలలో సంబంధిత అధికారులతో పి.జి.ఆర్. ఎస్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ సమస్యలు పరిష్కరిస్తే జిల్లా స్థాయికి వచ్చే అర్జీలసంఖ్య గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయన్నారు. కేవలం మండల డివిజన్ స్థాయి వేదికలలో పరిష్కారం కానీ, మరియు జిల్లా స్థాయి సమస్యల గూర్చి మాత్రమే అర్జీలు జిల్లాస్థాయి మీ కోసంలో సమర్పించాలని ఆయన స్పష్టం చేశారు స్వీకరించిన అర్జీల గూర్చి సంబంధిత అధికారులతో అక్కడి కక్కడే సంప్రదించి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేసారు.

అర్జీలు రీ ఓపెన్ కాకుండా పరిష్కారం చూపాలని తెలిపారు. గ్రామ, మండల స్థాయిలో పరిష్కారం కావలసిన సమస్యల గూర్చి కూడా ప్రజలు జిల్లా కార్యాలయానికి వస్తున్నారని, అందువలన ప్రజలకు డబ్బు, సమయం వృదా అవుతు న్నాయన్నారు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రంతో పాటు మండల డివిజన్ కేంద్రాలలో గల తహశీల్దార్ మరియు ఎమ్.పి.డి.ఒ కార్యాల యంల వద్ ప్రజా సమస్యల పరి ష్కార కార్యక్రమం నిర్వహించ బడుతున్నదనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని, గ్రామ స్థాయిలో ప్రచారం చేయాలని తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని అందుకు గాను వచ్చిన ప్రతీ అర్జీని అవగాహన చేసుకోవడం, అర్జీదారుని వద్దకు వెళ్లి సమస్య గూర్చి విచారించడం సమస్య సంబంధితశాఖ పరిధిలోనిది కాకపోతే తెలియజేయడం, అందుకు గలకారణాలను వివరించడం, తదుపరి కార్యాచరణ పై అర్జీదారునికి అవగాహన పెంపొందించాలన్నారు.


ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ కార్తీక్ డీ ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ దుర్గారావు దొర, డిపిఓ శాంత లక్ష్మి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పీ కే పీ ప్రసాద్, సిపిఓ వెంకటేశ్వర్లు ట్రాన్స్కో ఎస్సీ ఎస్ రాజబాబు డిఎస్ఓ ఉదయభాస్కర్ డి ఐపిఆర్ఓ కె లక్ష్మీనా రాయణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సి కృష్ణారెడ్డి వికాస జనరల్ మేనేజర్ జి రమేష్ వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విజ్ఞానం రాష్ట్రస్థాయిలో ప్రభంజనం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం జనవరి 8: విజయవాడలోని మురళి రిసార్ట్స్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి దక్షిణ భారత విజ్ఞాన ప్రదర్శనలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విజయ […]

మరో కొత్త రూ.50 నోట్లు విడుదల

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐత్వరలో రూ.50 కొత్త నోట్లను జారీ చేయనుంది. ఈ నోట్లు ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో రానున్నాయి. […]

ఏ ఒక్క గుండె ఆగకూడదు-ఏ కుటుంబం బాధపడకూడదు:రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-రామచంద్రపురం జనవరి 7:సమాజం బాగుండాలంటే అందరికీ సంపూర్ణ ఆరోగ్యం ఉండాలనే స్ఫూర్తితో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకునే దిశగా […]

ఆత్మకూరులో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి

ఆంధ్రప్రదేశ్ నంద్యాల ఆత్మకూరులో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందారు.అతిసారతో మరొకరి పరిస్థితి విషమం మారింది. మరో ముగ్గురు బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ సీరియస్ గా […]