ఓ బాలికను వివాహం చేసుకున్న బాలుడిపై బాల్య వివాహం కేసుతో పాటు, పోక్సో కేసు నమోదు చేసిన ఘటన రాజమండ్రి ఒకటో పట్టణ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ప్రజా ఆయుధం: ఓ బాలిక పెళ్లి చేసుకున్న బాలుడిపై బాల్య వివాహం కేసుతో పాటు, పోక్సో కేసు నమోదు చేసిన ఘటన రాజమహేంద్రవరం ఒకటో పట్టణ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ మురళీకృష్ణ వివరాల మేరకు.. గోకవరం ప్రాంతానికి చెందిన ఓ బాలిక (17) రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ రెండో ఏడాది చదువుతోంది. గోకవరానికి చెందిన ఓ బాలుడు (18) ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి.. కళాశాల వద్ద ఉన్న తనను శుక్రవారం బలవంతంగా తీసుకువెళ్లి పెళ్లి చేసుకున్నట్లు బాలిక శనివారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆ మేరకు బాలుడిపై పోక్సో కేసుతో పాటు, బాల్యవివాహ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.