
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – విజయవాడ జూన్ 07:

కెసి ఫైబర్ నెట్వర్క్ ఎండి మైపాల రాంబాబు మర్యాదపూర్వకంగా చైర్మన్ ను కలిశారు.
ఎస్సీ కమీషన్ చైర్మన్ జవహర్ ను మర్యాదపూర్వకంగా దళిత వర్గాలు కలిసాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ గా కొవ్వూరు చెందిన మాజీ మంత్రి కే ఎస్ జవహర్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసినదే. ఆయనను మర్యాద పూర్వకంగా శనివారం దళిత ఫెడరేషన్ అధ్యక్షుడు చెట్టే రాజు కలిసారు. రాజు అధ్వర్యంలో జవహర్ ను భారీ గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. దళిత నాయకులు సందర్భంగా మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న ఎస్సీ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించేలా చూడాలని కమీషన్ చైర్మన్ ను కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పోలపల్లి బాలకృష్ణ, మల్లిపూడి కిషోర్ బాబు, మల్లిపూడి కృష్ణ బాబు, మార్లపూడి అచ్చిబాబు, చెట్టే బాలు, యామవరపు సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు