
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం జనవరి 7:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న కొబ్బరి ముడి సరుకు ఆధారంగా విలువ ఆధా రిత పరిశ్రమలు కేరళ, తమిళనాడు మాదిరిగా స్థాపనకై ఉద్యాన, పరిశ్ర మల శాఖ అధికారులు సమన్వయంతో ఎక్స్ పో జర్ సందర్శన చేసి అధ్య యనం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. మంగళవారం జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమ ల కేంద్రం ఆధ్వర్యం లో స్థానిక కలెక్ట రేట్ నందు కమిటీ సభ్యులతో నిర్వ హించారు. వివిధ పరిశ్ర మలకు రాయితీలు కల్పన ప్రధానమంత్రి ఉపాధి కల్పన, ఏక గవాక్ష విధానంలో అనుమతులు మంజూరు కొత్త పరిశ్ర మల పాలసీ 2024- 2029 , క్వాయర్ పరిశ్రమలు పై పోకస్, రోడ్ల నిర్మాణ రంగానికి సంబం ధించి కొబ్బరి ఆధారిత జియో టెక్స్టైల్ మ్యాట్లు తయారీ, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, ఎం ఎస్ ఎం ఇ యూనిట్లు స్థాపన ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ ఈ కామర్స్ విధానంలో ట్రేడర్స్ రిజిస్ట్రేషన్ వినియోగదా రులు ఆర్డర్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత టార్గెట్ క్లస్టర్ అభి వృద్ధి కార్యక్రమాలు రాయ వరం మండలం మాచవరం లో పప్పు దినుసులు క్లస్టర్ ఏర్పాటు పురోగతి, మామిడి కుదురు, మల్కిపురం గ్రామా లలో కొబ్బరి ఆదారిత యూ నిట్ల ఏర్పాటులో పురోగతి, ఆత్రేయపురంలో పూతరేకులు క్లస్టర్ ఏర్పాటు, వంటి పురోగ తి అంశాలపై కమిటీ సభ్యు లతో సమీక్షించారు ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు రాయితీలతో పరిశ్రమల స్థాప నకై అవకాశాలు కల్పిస్తున్నా యని ఆ స్థాయిలో కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటుకు ఔత్సాహిక పారి శ్రామిక వేత్తలు ముందుకు రావాలని ఆ దిశగా కమిటీ సభ్యులు చైతన్యాన్ని తీసుకొని వచ్చి ప్రోత్సహిం చాలని సూచించారు.

కొబ్బరి ముడిసరుకు ఆధారంగా వర్జిన్ కోకోనట్ కొబ్బరి వాటర్ ద్వారా పౌడర్ తయారీ ,కోకో పిట్ తయారీ వంటి విలువ ఆదారిత రంగాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని అందుకు అవసరమైన క్లస్టర్ డెవలప్మెం ట్ పరిశ్రమల స్థాపనకై అనువైన స్థలాలను ఎంపిక చేయ డంతో పాటుగా పరిశ్ర మల స్థాపనకై ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఎంపిక చేయాలని సూచించారు ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా పథకం (పీఎంఈజీఎస్) ఉపాధికి ఊతం, ఉన్నతికి మార్గమన్నారు. స్వయం ఉపాధితో పాటు మరో పదిమందికి ఉపాధి చూపేం దుకు, జీవితంలో ఉన్నతికి పీఎంఈజీఎస్ పథకం ఉప యోగ పడుతుందని, యువ త ఆసక్తికి అనుగుణంగా స్వయం ఉపాధి మార్గాలను చూపడం ద్వారా సమగ్రాభి వృద్ధి సాధ్యమవుతుందని, ఈ క్రమంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో క్రెడిట్ లింక్డ్ తో పాటుగా రాయితీ కల్పించి పారిశ్రామికంగా, ఉపాధి కల్పన పరంగా ప్రగతిని సాధించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్వయం ఉపాధి పథకా లు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అర్హులైన వారు సద్వినియోగం చేసు కునేలా ముందుకు నడిపిం చాలని అధికారులకు సూచించారు, స్వర్ణాంధ్ర @ 2047 సాధన దిశగా వివిధ శాఖల అధికారులు నిబద్ధ తతో పని చేయాలన్నారు. యువతకు వినూత్న ఆలో చనలతో ముందుకు రావా లని ,ఎస్సీ, ఎస్టీ, మహిళ లకు అదనపు ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుందని, ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామిక వేత్తను తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోం దన్నారు.ప్రభుత్వ సహకారం తో నిరుద్యోగ యువత పారీ శ్రామిక వేత్తగా మారటానికి పరిశ్రమలు ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం సృష్టించడంతో పాటు ఆర్థిక భద్రత, అన్ని రకాల ప్రోత్సా హకాలు అందిస్తుందన్నారు. ఉద్యం పోర్టల్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకొని ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ అందించే ప్రోత్సాహకాలకు అర్హతసాధించాలని సూచించారు.

అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి గుత్తాధి పత్య ఈ కామర్స్ విధానాలు కాకుండా, అతి చౌకగా డ్వాక్రా ఉత్ప త్తులు ఆన్లైన్ మార్కెటింగ్ కొరకు ఓపెన్ నెట్వర్క్ డిజి టల్ ఈ కామర్స్ నందు స్వచ్ఛందంగా ట్రేడర్స్ నమో దు చేసుకుని వర్తకుల ఆర్డర్ వంటి ఆన్లైన్ విధానాన్ని ప్రోత్సహించాలన్నారు. పీఎం విశ్వకర్మ యోజన ద్వారా కులవృత్తులకు అధునాతన పనిముట్లను రాయితీలపై అందించి ప్రోత్సహించాల న్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల సహకారంతో మరిన్ని యూనిట్లు నెల కొల్పేందుకు కమిటీ సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకో వాల న్నారు. ఈ కార్యక్ర మంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పీకే పీ ప్రసాద్, సహాయ సంచాల కులు శివరాం ప్రసాద్, ఉద్యాన అధికారి బివి రమణ, డి ఆర్ డి ఎ పి డి శివ శంకర్ ప్రసాద్ డ్వామా పీడీ మధుసూదన్, సిడ్బి ప్రోగ్రాం మేనేజర్ శ్రీనివాసరావు, ఎల్ డి ఎం కేశవ వర్మ, కాయర్ బోర్డ్ ప్రతినిధి వినోద్ కుమార్ కోకోనట్ బోర్డ్ ప్రతినిధి కుమార్, డి ఐ పి ఆర్ ఓ కే లక్ష్మీనారాయణ వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు