
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రాజోలు, ఆగస్ట్ 19 :
రాజోలు తాసిల్దార్ కార్యాలయానికి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర దళిత చైతన్య వేదిక భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాన్ని బహుకరించింది. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా రాజోలు తాసిల్దార్ కార్యాలయంలో వేదిక వ్యవస్థాపకులు బత్తుల మురళీకృష్ణ అధ్యక్షతన తాసిల్దార్ తో సమావేశమైన దళిత చైతన్య వేదిక నాయకులు అంబేడ్కర్ చిత్రపటాన్ని తాసిల్దార్ సిహెచ్ భాస్కర్ కు అందించారు. అంబేడ్కర్ చిత్రపటానికి నాయకుల సమక్షంలో తాసిల్దార్ భాస్కర్ పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు రాజ్యాంగ బద్ధంగా నడుచుకొని నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలను వేధించకుండా వారికి అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజోలు వైస్ ఎంపీపీ పొలుమూరి శ్యాంబాబు, శివకోటి సర్పంచ్ నక్కా రామారావు, రాష్ట్ర దళిత నాయకులు గెడ్డం సింహా, సరేళ్ళ విజయ్ ప్రసాద్, వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ చింతా శ్రీను, ఉపాధ్యక్షులు చిలకపాటి శ్రీధర్, జిల్లా అధ్యక్షులు లిఖితపూడి బుజ్జి, మండల అధ్యక్షులు మందపాటి మధు సభ్యులు దీపాటి శివప్రసాద్,మట్టా సురేష్ కుమార్, జిల్లెళ్ళ వినోద్, గొల్లమందల నాగేంద్ర, మెడబల శ్యాం శేఖర్, పొన్నమాటి భాస్కర్, బొడ్డపల్లి ప్రసాద్, గోగి మోహన్, బుంగ శ్రీను, కడలి ప్రసాద్, ఉప్పే జగదీష్, ఆకుల చిన్నమ్మ నాయడు, పాస్టర్ చెల్లిం ప్రసాద్ లతో పాటుగా తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది కూడా పాల్గొన్నారు.