
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 25:

జాతీయ ఓటర్లు దినోత్సవాన్ని పురస్క రించుకొని శనివారం ఉదయం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి గడియారపు స్తంభం సెంటర్ వరకు నిర్వహించిన త్రీ కే రన్ను స్థానిక కలెక్ట రేట్ వద్ద జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాoతి ప్రారంభించారు.


అనంతరం త్రీ కే రన్ లో ఆమె పాల్గొ న్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మాధవి. మున్సిపల్ కమిషనర్ రాజు, వాకర్స్ క్లబ్ అధ్యక్షులు బోణం సత్యవరప్రసాద్, ప్రొఫెసర్ గోకరకోండ నాగేంద్ర , రంకిరెడ్డి కాశీ విశ్వనాథ్ కిమ్స్ రెవెన్యూ సిబ్బంది విద్యాసంస్థల విద్యార్థు లు, బివిసి విద్యాసంస్థల విద్యార్థులు స్థానిక పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.