

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 15:
అమలాపురం రానున్న గంటి హరీష్ బాలయోగి

కాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిని మరియు ఆపరేషన్ సింధూర్ పరిస్థితులను అమెరికా,పనామా,
గాయానా,బ్రెజిల్, కొలంబియా దేశాల్లో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ బాలయోగి పర్యటించారు.
అఖిల పక్ష బృందంలో సభ్యునిగా భారతదేశ వాణిని విదేశాలలో వినిపించి రేపు సోమవారం సాయంత్రం 4 ,గంటలకు నల్ల వంతెన వద్ద గంటి హరీష్ బాలయోగి నివాస గృహానికి చేరుకుంటున్నారు. అమలాపురం తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యాలయం నుండి మీడియాకు సమాచారం అందింది.