
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం, ఫిబ్రవరి 28,2025

కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరిండెంట్ బి మురళీ కృష్ణ , అంబాజీపేట తహసిల్దార్ జె.వెంకటేశ్వరి పదవీ విరమణ

కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరిండెంట్ బి మురళీకృష్ణ, అంబాజీపేట తాసిల్దార్ జె .వెంకటేశ్వరి శుక్రవారం సర్వీస్ పూర్తిచేసుకుని పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా అమలాపురం కలెక్టరేట్లో వారిద్దరికీ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. రెవెన్యూ శాఖలో అత్యుత్తమంగా పనిచేసి అందరి మన్ననలు పొందారని.. జాయింట్ కలెక్టర్ టి నిషాంతి, జిల్లా రెవెన్యూ అధికారి బి ఎల్ ఎన్ రాజకుమారి ప్రశంసించారు. పదవీ విరమణ అనంతరం సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం కలెక్టరేట్ సిబ్బంది వీరిని ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు.

అంతకుముందు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పదవీ విరమణ చేస్తున్న ఇరువురిని కలెక్టర్ ఛాంబర్ లో శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. శేష జీవితాన్ని కుటుంబంతో సుఖ సంతోషాలతో గడపాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి కే విశ్వేశ్వరరావు, ఏపీ రెవెన్యూ జేఏసీ చైర్మన్ విఎస్ దివాకర్, కలెక్టరేట్ సూపర్డెంట్లు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు