
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అల్లవరం ఆగస్టు 20:
అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం దేవగుప్తం గ్రామానికి చెందిన వైయస్ఆర్సీపీ సీనియర్ కార్యకర్త వెంకటేశ్వరరావు (దడేల్) తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు, అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ పేరూరులోని సాయి విశ్వాస్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వెంకటేశ్వరరావు ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా మానవతా దృక్పథంతో
వారి కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందించారు. ఇలాంటి చర్యల ద్వారా సామాజిక బాధ్యతను ఆమె ప్రతిబింబించారు.