అయినవిల్లి మండలం ఫోటో,వీడియో గ్రాఫిక్ యూనియన్ ఆధ్వర్యంలో కాశి కు ఘణ సన్మానం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ – అయినవిల్లి ఆగస్టు 19:

అయినవిల్లి మండలం ఫోటో,వీడియో గ్రాఫిక్ యూనియన్ ఆధ్వర్యంలో కాశి కు ఘణ సన్మానం జరిగింది.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం ఫోటో,వీడియో గ్రాఫిక్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు.అధ్యక్షుడు చక్రి సమక్షంలో ఫోటోగ్రఫీ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు మరియు సర్పంచ్ కాశీ వీర వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ..1837లో, నిసెఫోర్ నీప్సే మరియు లూయిస్ డాగ్యురే, డాగ్యురే రకం ఫోటోగ్రాఫిక్ వ్యవస్థను కనుగొన్నారు అన్నారు. ఈ పద్ధతిని డాగ్యురే రకంగా ఆచరిస్తున్నారు. ఈ ఆచరణాత్మక ఫోటోగ్రఫీ పద్ధతిని మొదట కనుగొన్న శాస్త్రవేత్త లూయిస్ డాగ్యురే అని కాశి వివరించారు. అతని పేరు తర్వాత, ఈ విధంగా చిత్రాలను తీయడాన్ని డాగ్యురే రకం ఫోటోగ్రఫీ అంటారు. అప్పటి నుండి ఫోటోగ్రఫీలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆగస్టు 19, 1839న, మొదటి ఫ్రెంచ్ ప్రభుత్వం ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంగా ప్రకటించింది అని కాశి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాశీను ఘనంగా సత్కారించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మెంబర్ కృష్ణ, కార్యవర్గం దేవి ప్రసాద్, శివ వెంకటేష్, మరియు అమలాపురం వివిధ ఫోటోగ్రఫీ అధ్యక్షులు,కే శేఖర్, ప్రకాష్ , వై ధనరాజ్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

డాక్టర్ కారెం రవితేజకు ఘన సన్మానం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ముమ్మిడివరం ఫిబ్రవరి 07: డాక్టర్ కారెం రవితేజను ముమ్మిడివరంలో ఘనంగా సత్కరించారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ […]

‘సూర్యఘర్’ పథకం సోలార్ విద్యుత్ ప్లాంట్ల సంస్థాపన: కలెక్టర్ మహేష్ కుమార్

తెలుగు రాష్ట్రం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 17: పురపాలక సంఘాలలో ‘సూర్యఘర్’ పథకంలో సోలార్ విద్యుత్ ప్లాంట్ల సంస్థాపన ద్వారా విద్యుత్ చార్జీలు గణనీయంగా తగ్గి, స్థానిక సంస్థలు ఆర్థికంగా […]

అమలాపురంలో డంపింగ్ యార్డుకు భూసేకరణ చర్యలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం జనవరి 18: అమలాపురం పట్టణం మరియు పరిసర గ్రామాలలోని ఘన ద్రవ పదార్థాల వ్యర్థా లను డంపింగ్ యార్డుకు తరలించి రీసైక్లింగ్ […]

శానపల్లిలంక గ్రామంలో బోరున విలపిస్తున్న దళిత కుటుంబం

చంద్రబాబు పవన్ కళ్యాణ్ గార్లు నా కుటుంబానికి న్యాయం చేయండి: నక్క వెంకట్రావు V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి డిసెంబర్ 24:చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ […]