V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ముమ్మిడివరం ఫిబ్రవరి 07:

డాక్టర్ కారెం రవితేజను ముమ్మిడివరంలో ఘనంగా సత్కరించారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ ముమ్మిడివరం నగరం లో మాతా రమాబాయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాతా రమాబాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో రమాబాయి విగ్రహాన్ని స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు రాజు , అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు ప్రస్తుత ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, ఉపాధ్యాయ నాయకులు ఎం ఏ కే భీమారావు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ కుమార్, ప్రముఖ విప్లవ గాయకుడు రేజెండ్ల రాజేష్ , అయినవిల్లి జడ్పిటిసి గన్నవరపు శ్రీనివాసరావు,నగర పంచాయతీ చైర్మన్ కాశీ నవీన్ కుమార్ ,అమలాపురం కోనసీమ కేర్ ఎమర్జెన్సీ హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ డాక్టర్ కారెం రవితేజ, మరియు ఉద్యమ నాయకులు ఇసుక పట్ల రఘుబాబు, రేవు తిరుమలరావు తదితరులు సమక్షంలో విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కరోనా సమయంలో ఉత్తమ వైద్య సేవలు అందించినందుకు జిల్లా జాతీయ స్థాయి అవార్డులు అందుకున్న డాక్టర్ కారెం రవితేజను శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి భారీ ఎత్తున మాతా రమాబాయి అంబేద్కర్ అభిమానులు విద్యావేత్తలు ప్రజా సంఘ నాయకులు ఉపాధ్యాయ సంఘాలు తదితరులు హాజరయ్యారు.