
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 19:

బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం మూలంగా ఒకవైపు షాంపూభారీ వర్షాలు మరో వైపు గోదావరి నది పరివాహ ప్రాంతాలలో నుండి ఉదృతంగా వస్తున్న వరద మూలంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న నేపథ్యంలో సహా యక చర్యలకు ప్రభుత్వం సమాయత్తమైందని ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు అధి కారులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గోదావరి నది ఉధృతి కారణంగా నది తీర్ప్రాంత గ్రామం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోదావరి హెడ్ వర్క్స్ ఇంజనీర్లు ను గోదావరి ఏటి గట్టు వెంబడి బలహీన ప్రాం తాలలో ఇసుక బస్తాలు అమర్చి బలహీనంగా ఉన్న గట్లను బలోపేతం చేయాల ని ఆదేశించినట్లు తెలిపారు ఏటిగట్టు వెంబడి ఎటువం టి గండ్లు పడకుండా అప్రమ త్తంగా అధికారులు వ్యవహ రించాలన్నారు. భారీ వర్షా లు మూలంగా పల్లపు లోతట్టు ప్రాంతాలు జల మయం అయ్యే అవకాశా లు ఉన్నాయని. మరోవైపు గోదావరి వరద ఉధృతి పెరిగితే వీరిని సురక్షిత ప్రాంతాలకు లేదా పునరా వాస కేంద్రాలకు ముంపు బాధితులను తరలించేం దుకు వీలుగా పడవలు లైఫ్ జాకెట్లతో సహా సిద్ధం చేసుకోవడంతో పాటుగా గజఈతగాళ్లను మత్స్య శాఖ సహకారంతో నియమించి పోలీస్ యంత్రాంగం సమన్వ యంతో సహాయక చర్య లకు ఉపక్రమించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అధికారులు లోతట్టు ప్రాంతాలలో ఉంటూ భారీ వర్షాలు, వరద పరిస్థితులను అంచనా వేసి వరద హెచ్చరికలకు అనుగుణం గా సహాయక చర్యలకు సంసిద్ధం కావాలన్నారు. వరద పరిస్థితుల నేప థ్యంలో అవసరమైతే ముంపు బాధితులకు ఆహారం సురక్షితమైన త్రాగునీరు పునరావాస కేంద్రాలలో వసతి వంటి సౌకర్యాలు కల్పనకు అధి కారులు సిద్ధపడాలని సూ చించారు. ఇప్పటికే అమలాపురం కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధి కారులు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి ముంపు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని ఆయన వెల్లడించారు గోదావరి నది నీటిమట్టం ప్రవాహస్థాయి వేగం అను గుణంగా మొదటి హెచ్చరి కలో ముంపు బారిన పడే ప్రాంతాలలో అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలన్నారు నది తీరం వెంబడి ఎవరు నదిలో స్నానాలకు వెళ్లరాదని సముద్ర తీరం వెంబడి మత్స్యకారులు సముద్రంపై చేపల వేటకు వెళ్లరాదని ఆయన స్పష్టం చేశారు.