
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం ఆగస్టు 19:

కిమ్స్ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఈదరపల్లి పంచాయతీలో ఉన్న హరి మనోవికాస కేంద్రంలో మంగళవారం ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. కిమ్స్ డాక్టర్ పి రామకృష్ణ ఆధ్వర్యంలో క్యాంపు జరిగింది ఇందులో భాగంగా చిన్నపిల్లల వైద్యులు చర్మవ్యాధుల చర్మవ్యాధులు ఫిజియోథెరపీ. జనరల్ మెడిసిన్ ఆర్థోపెడిక్ టీం వచ్చి దివ్యాంగుల పిల్లలకు అన్ని రకముల స్పీచ్ ఎం ఆర్ ఆర్తో విభాగాలను పరీక్షించి మందులు ఉచితంగా అందించారు. 55 మంది దివ్యాంగుల పిల్లలకు పరీక్షలు నిర్వహించారు… శస్త్ర చికిత్సలు అవసరమైతే దివ్యాంగుల పిల్లలకు ఉచితంగా కిమ్స్ హాస్పిటల్ ఆపరేషన్ చేస్తారని తెలిపారు..
ఈ కార్యక్రమంలో హరి మనోవికాస కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ రాజశేఖర్, డైరెక్టర్ ఎస్ రాజ్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు..