
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం ఆగస్టు 19:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దోమల సంతానోత్పత్తి నివారణ చర్యల్లో భాగంగా జిల్లాకు
2 లక్షల గంబుజియా చేప లను మత్స్యశాఖ కేటా యించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం దుర్గారావు దొర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఈనెల 20వ తేదీన ప్రపంచ దోమల దినోత్సవాన్ని పుర స్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చాం బర్లో వరల్డ్ మస్కిటో డే బ్యానర్ ను ఆవిష్కరించా రు ఆడ ఎలాపిలాస్ దోమ ద్వారా మలేరియా వ్యాప్తి చెందుతుందని కనుగొన్న శాస్త్రవేత్త రోనాల్డ్ రాస్ చిత్ర పటానికి అన్ని పీహెచ్సీఎల్ లో ఈ నెల 20వ తేదీన పూల మాలలు అలంకరించి నివాళులర్పిస్తారన్నారు.

క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా మలేరియా నివారణ పట్ల ప్రజలందరికీ అవగాహ న కలుగజేయాలని ఆయన సూచించారు ఈదరపల్లి గ్రామంలో గంబూజియా చేపల విడుదల కార్యక్రమాన్ని లాంచనంగా డిఎం అండ్ హెచ్ ఓ ప్రారంభించారు .జిల్లాలోని 38 PHC ల పరిధిలో గల 132 గ్రామాలలోని 289 ఆవా సాలలో 2 లక్షల గంబు జయా- చేప పిల్లలను విడుదల చేయడం జరిగిం దన్నారు దోమల లార్వా లను నియం త్రించడానికి గంబూజియా చేపలను నీటి నిల్వ ఉన్న చోట్ల వదలడం అత్యంత ప్రభావవంతమైన పర్యా వరణ అనుకూల పద్ధతి అన్నారు. వీటిని మస్కిటో ఫిష్ అని కూడా అంటారన్నారు. ఇవి దోమల లార్వాలను, ప్యూపాలను తింటూ దోమల సంతానో త్పత్తిని నిరోధిస్తా యన్నారు. దోమల లార్వా శ్వాస తీసుకోవడా నికి నీటి ఉపరి తలంపైకి వస్తుందనీ. ఆ సమయంలో గంబూజియా చేపలు వాటిని వేగంగా తినేస్తాయ న్నారు. గంబూజియా చేపలు నిల్వ ఉన్న నీటిలో, చెరువులలో, కొలనులలో, కాలువలలో గుంతలలో కూడా సులభంగా జీవించ గలవన్నారు. ఈ చేపలు నీటిలోని ఉష్ణోగ్రత మా ర్పులను కూడా తట్టు కోగలవన్నారు.దోమల వల్ల వచ్చే మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా వంటి వ్యాధు లను నివారిం చడంలో ఈ చేపలు చాలా ఉపయోగప డతాయ న్నారు రసాయ నాలతో కూడిన స్ప్రేలు లేదా ఫాగింగ్ కంటే ఇది ఖర్చు తక్కువ పర్యావ రణానికి కూడా మంచిద న్నారు. సహజ జలవనరుల లో కంటే, నీరు బయటకు పోని నిల్వ ఉన్న ప్రదేశాల లో వదలడానికి అనుకూ లమన్నారు ఉదా హరణకు, అలంకరణ కొలనులు, నీటి ట్యాంకులు, నిరుపయోగం గా ఉన్న స్విమ్మింగ్ పూల్స్ లేదా ఇంట్లో చిన్న నీటి తొట్టెలలో వదలాలని. వీటిని నదులు లేదా ప్రవహించే కాలువల్లో వదలకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పుగో దావరి జిల్లా మత్స్యశాఖ అధికారి ఎన్ నిర్మల కుమారి, ఎఫ్ డి ఓ గోపాలరావు, మలేరియా అధికారి ఎన్ వెంకటేశ్వ రరావు సబ్ యూనిట్ ఆఫీసర్లు రాజకుమార్ రాజబాబు ఆదినారాయణ వెంకటే శ్వరరావు బిషప్ ఎన్ వి రామారావు హెల్త్ అసిస్టెం ట్లు తదితరులు పాల్గొన్నారు.