అమలాపురంలో ఘనంగా హోలీ ఆర్మీ సువార్త విజయోత్సవాలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం మార్చి 16:

పాపం బలమైనదా?
యేసుప్రభు తో స్నేహం బలమైనదా?
ఏసుప్రభుతో సహవాసము బహు విలువైనది, ఈ లోకం కొద్ది కాలమే ! మనము శ్రేష్టంగా జీవించాలని హోలీ హార్మీ ఫెలోషిప్ అధ్యక్షులు యమ్.ఇస్సాకు బాబు బోధిస్తూ… పేర్కొన్నారు.

స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహానుకంటె గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోకరాజ్యములో అల్పుడైన వాడు అతని కంటె గొప్పవాడు. మత్తయి 11:11

హోలీ ఆర్మీ సువార్త విజయోత్సవాలు అమలాపురం లో ఘనంగా జరిగాయి. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం సమీపం, బోంతు వారు పేట ఓఎన్జిసి గ్రౌండ్ నందు , మార్చి 12, 13, 14, 15 తేదీల్లో హోలీ ఆర్మీ సువార్త క్రైస్తవ విజయోత్సవాలు, అమలాపురం హోలీ ఆర్మి ఫెలోషిప్ ఆధ్వర్యంలో హెడ్ క్వార్టర్ ఏలూరు జిల్లా,మండవల్లి హెచ్ ఏ ఎఫ్ (పరిశుద్ధ సైనిక సహవాసం) వ్యవస్థాపకులు దైవ సేవకులు కీ”శే” యమ్. అబ్రహాము అయ్యగారు ప్రార్థన వాగ్దానాలు తో నిర్వహించబడ్డాయి అని సభా నిర్వాహకులు తెలిపారు.

నాలుగు రోజులు పగలు,రాత్రులు ఉజ్జీవంగా పరిశుద్ధ బైబిలు గ్రంథం అనుసరిస్తూ.. కీర్తనలు, దైవ సందేశాలతో దేవుని మహిమ పరిచారు.

ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల నుండి దైవ సేవకులు ఈ స్థలానికి చేరుకున్నారు. దేవుని వాక్యాలతో ఆధ్యాత్మికమైన దైవ భక్తి సందేశాలు తో ఆత్మీయంగా విశ్వాసులను బలపరుస్తూ.. వచ్చారు.

ఆఖరు రోజు శనివారం రాత్రి శనివారం హోలీ ఆర్మీ సహవాస అధ్యక్షులు యమ్. ఇస్సాకు బాబు ఆరాధనలో నడిపించగా.. దైవ సేవకురాలు యమ్. రాణి అబ్రహాము, ఏసుక్రీస్తు బోధలను వివిధ రూపాలు లో బోధించారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి,నీ శత్రువు కొరకు ప్రార్థించాలి,

ఏపరిస్థితుల్లోనైనా సరే నీ పొరుగు వారిది ఏదియు దొంగలించకూడదు. అబద్ధం ఆడకూడదు.చెడు వ్యసనాలను విడిచిపెట్టి దేవుని మార్గం వైపు రావాలన్నారు. అట్టి రీతిగా ఆయన వలె దీనత్వాన్ని పొందుకునీ పరలోక రాజ్యానికి వారసులు కావాలి అని బలముగా పలు వర్తమానాలతో బోధించారు.

ఆఖరి దినం శనివారం రాత్రి వేలాది మంది విశ్వాసులు సభా ప్రార్థన స్థలానికి చేరుకుని దేవుని పేరట ప్రార్థనలు చేస్తూ ఘనమైన రీతిలో యేసుక్రీస్తును మహిమ పరిచారు. ఆశీర్వాద ప్రార్థనలతో నాలుగు రోజుల సభలు ముగించబడ్డాయి.

వార్త సేకరణ: వినయ్ కుమార్ (జర్నలిస్ట్) మరియు V9 ప్రజా ఆయుధం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చైర్మన్.

వార్త సేకరణ అంటే వార్తలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడం, మరియు ప్రసారం చేయడం. ఇది జర్నలిజం, మీడియా మరియు సమాచార రంగాలలో ఒక ముఖ్యమైన ప్రక్రియ. 

Related Articles

బాణాసంచా పేలుళ్లు మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి సుభాష్

రాయవరం,అక్టోబర్ 08 : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమరావతి నుంచి నేరుగా రాయవరం చేరుకున్న మంత్రిక్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలుబాణాసంచాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రాయవరం మండలం కొమరిపాలెంలో బుధవారం బాణాసంచా […]

అంబాజీపేట ఏఎంసీ డైరెక్టర్ గా ఎంపికైన మోర్త సత్తిబాబు కు అభినందనలు తెలిపిన హెచ్ఆర్డి & V9 మీడియా

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 15: అంబాజీపేట ఏఎంసీ డైరెక్టర్ హా ఎంపికైన మోర్త సత్తిబాబు కు హెచ్ఆర్డి & V9 మీడియా అభినందనలు తెలిపారు.డాక్టర్ బి […]

రేపటి నుంచే వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో వాట్సాప్ గవర్నెన్స్ పై. సీఎం చంద్రబాబు నేడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. వాట్సాప్ గవర్నెన్స్ సేవలను రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. మొదటి విడతగా […]

చైర్మన్ యెల్లమెల్లి విజయ్ ఆధ్వర్యంలో పుస్తకాలు కిట్లు పంపిణీ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూన్ 16: చైర్మన్ యెల్లమెల్లి విజయ్ ఆధ్వర్యంలో పుస్తకాలు కిట్లు పంపిణీ జరిగింది.డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలం శానపల్లిలంక […]