

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 13:
అమలాపురం డివిజన్ స్థాయి అభివృద్ధి అధికారి జె వేణుగోపాల్ శుక్రవారం డిఎల్డిఓ గా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయన స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వారిను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకిత భావం జవాబు దారి తనంతో వ్యవహరిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా డివిజన్ అభివృ ద్ధిలో కీలక భూమిక పోషించాలని డి ఎల్ డి ఓ వేణుగోపాల్ కు సూచించారు.