
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ అయినవిల్లి 19 ఫిబ్రవరి 2025:

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మరియు మాజీ ఏఎంసీ చైర్మన్ మద్దాల సుబ్రహ్మణ్యేశ్వర రావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం పొట్టిలంక కొండుకుదురు, ఎస్. మూలపొలం, శానపల్లిలంక , గ్రామాలలో బుధవారం స్థానిక శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టబద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎన్డీఏ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రసారం నిర్వహించారు. ముఖ్యంగా ఈ ప్రచారాన్ని కీ అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ , ఎమ్మెల్సీ పరిశీలకులు దువ్వరపు రామారావు, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ మోకా ఆనంద సాగర్, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ సత్తిబాబు రాజు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతలక్ష్మి, అసెంబ్లీ పరిశీలకులు షేక్ సుభాన్ ,రాష్ట్ర హెచ్ఆర్డి సభ్యులు నేదునూరి వీర్రాజు,హాజరయ్యారు. మొదటగా పొట్టిలంక గ్రామంలో ఈ ప్రచారాన్ని ప్రారంభించి,చివరలో తోత్తరమూడి గ్రామం మద్దాలసుబ్రహ్మణ్యేశ్వర రావు స్వగృహం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎంపీ, హరీష్ ఎమ్మెల్యే గిడ్డి,కోరారు.


అనంతరం మీడియా ప్రతినిధులతో ప్రజా సమస్యలపై ఆ ప్రజాప్రతినిధులు చర్చించారు. అనంతరం జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు మద్దాల సుధీర్ రాజా చేతుల మీదగా శాసనసభ్యులు మరియు పార్లమెంట్ సభ్యులు మరియు రామారావు, సుభాన్ లను శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో అయినవిల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చిట్టూరి శ్రీనివాసరావు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కళ్ళేపల్లి సుబ్బారాజు, బిక్కిన బాబి, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, మండల పార్టీ కార్యదర్శి కుడుపూడి బుజ్జి,
న్యాయవాదిలు,బడుగు భాస్కర్ జోగేష్, వారా లక్ష్మీ నరసింహ,ఎంపీటీసీ లు రమేష్ రాజు, వర్రే శ్రీనివాస్, నిమ్మకాయల సత్యనారాయణ, మాజీ సర్పంచ్ విద్యాసాగర్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మెర్తా సత్తిబాబు, పాటి వెంకటేశ్వరరావు, గెల్లా అశోక్, నవీన్,అంబటి రాజు, నేదునూరి సత్యనారాయణ, మరియు మద్దాల తో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు అత్యధికంగా పాల్గొన్నారు.