
అయినవిల్లి మండలం వెలవలపల్లి,చింతనలంక గ్రామాల్లో తహశీల్దార్ నాగలక్ష్మిమ్మ పర్యటించారు. ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సు లో భాగంగా వెలవలపల్లి,చింతనలంక ఇరు గ్రామాల్లో రైతులు వద్దకు సోమవారం ఎమ్మార్వో నాగలక్ష్మిమ్మ, మండల స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ తో కలిసి పర్యటించి భూ వివాద సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలున్న రైతుల గూర్చి ఎమ్మార్వో నాగలక్ష్మిమ్మ మాట్లాడుతూ..మీ యొక్క సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇరు గ్రామాల సర్పంచ్ ఎంపీటీసీలు మరియు పంచాయతీ పాలక వర్గం సభ్యులు, రామ పెద్దలు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు