గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్ కుంచే రమణారావు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం.
పర్యావరణ పరి రక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా ఆరోగ్యకరమైన ఆనందకరమైన సమాజాన్ని తీర్చిదిద్దవచ్చని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సీనియర్ వైసిపి నాయకుడు గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్ కుంచే రమణారావు అన్నారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా గురువారం అమలాపురంలో గుడ్ సీడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రమణారావు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరూ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక మొక్కను నాటే అలవాటు చేసుకోవాలని రమణారావు సూచించారు. కార్యక్రమంలో కంచర్ల జాన్సన్, పందిరి సుబ్బరాజు, గంటా లక్ష్మీప్రసాద్, నేరేడుమిల్లి శ్రీను, విప్పర్తి రమేష్, ముత్తాబత్తుల గణేష్,పరమట రాజేష్,కుంచే అర్జున్ తదితరులు పాల్గొన్నారు.