సంక్షేమ వసతి గృహాలలో చేరే పేద విద్యార్థులు భవితకు సోపానాలుగా వసతి గృహాలు: మంత్రి డోలా శ్రీ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 16:

విద్యే ఏకైక ఆయుధంగా భావించి చదువుకోవాలనే పవిత్ర ఆశయంతో సంక్షేమ వసతి గృహాలలో చేరే పేద విద్యార్థుల భవితకు సోపానాలుగా వసతి గృహాలను నిలుపుతూ వార్డెన్లు నాణ్యమైన భోజనంతో పాటు విద్యను అభ్యసింప జేయాలని సాంఘిక సంక్షేమ శాఖ విభిన్న ప్రతిభావంతుల వయో వృద్ధుల సంక్షేమ శాఖల జి ఎస్ డబ్ల్యూ ఎస్ వాలంటీర్ల మంత్రి డా”డోలా శ్రీ బాల ఆంజనేయస్వామి అన్నారు.

బుధ వారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్థానిక కలెక్టరేట్ నందు జిల్లాలో సంక్షేమ వసతి గృహ పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, టీచర్ల బోధనా తీరు విద్యార్థుల ప్రగతి ఇత్యాది అంశాలపై వసతి గృహ సంక్షేమ అధికారుల తో సమీక్షించారు. తొలుత గా వసతి గృహాలలో ఖాళీలు సంఖ్య, అద్దె భవనాలు వార్డెన్ల ఖాళీలు అంశాలపై సమీక్షించి పొటెన్షియల్ మేరకు మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధి అంకితభావంతో విద్యార్థుల సంఖ్య పెంచ డానికి అర్హులైన ప్రతి విద్యార్థికి వసతి కల్పిం చేలా సంక్షేమ అధికారులు కృషి సల్పాలని ఆదేశించారు.

పొటెన్షియల్ ఉన్నప్పటికీ సంక్షేమ అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థుల ఇంటింటికి వెళ్లి ప్రవేశాలు కల్పించే చొరవ తీసుకోవా లని,ఎక్కువగా ఖాళీలు పెట్టి వసతి గృహాలు నిర్వహించడం సమంజసం కాదని ఆయన స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సాధికారత దిశగా ప్రజా ప్రతినిధులు జిల్లా కలెక్టర్ సమన్వయంతో సంక్షేమ అధికారులు పనిచేయాల్సిన ఆవశ్యక తను మంత్రి నొక్కి చెబుతూ ప్రభుత్వ ఆశయ సాధన దిశగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో ముందడుగు వేయాలని ఆయన స్పష్టం చేశారు. భవన భద్రత, పారిశుధ్యం, పరిశుభ్రత, ఆహార నాణ్యత అవసరమైన సౌకర్యాల లభ్యత పడకలు, అధ్య యన బల్లలు, కుర్చీలు,, సురక్షిత త్రాగునీరు, విద్యుత్, వైద్య సహాయం వంటి అంశాలకు ప్రాధా న్యత ఇవ్వాలన్నారు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కొరకు అంకిత భావంతో పనిచేయాలన్నారు. 10 ,ఇంటర్, డిగ్రీ పరీక్షలలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని అదేవిధంగా అత్యధిక మార్కులు స్కోర్ చేసిన విద్యార్థినీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన పది ఎక్స లెన్సీ సెంటర్లలో జాయిన్ చేసి ఐఐటి వంటి ఉన్నత చదువులకు మార్గ నిర్దేశం చేయాలని సూచించారు. ఈ ఏడాది కొత్తగా చేరిన విద్యార్థుల్లో భయం పోగొట్టి పాఠశాలలో ఆహ్లాద వాతా వరణం నెలకొల్పేలా చర్య లు చేపట్టాలన్నారు.

చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ఉపాధ్యా యులు ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రత్యేక స్టడీ అవర్స్ను టుటర్స్ ద్వారా నిర్వహించి పురోగతి సా ధించాలన్నారు విద్యార్థుల్లో ఆత్మనూన్యత, ఒంటరిత నం వంటివి పోగొట్టాలన్నా రు. విద్యార్థుల తో ఉపా ధ్యాయులు, పాఠశాల సిబ్బంది ఫ్రెండ్లీ.గా వ్యవహ రించాలన్నారు.వసతి గృహాల్లో విద్యార్థులకు ఉచిత వసతితో పాటు నాణ్యత తో కూడిన మూడు పూటలా మంచి రుచికర మైన, పోషకాలతో కూడిన భోజనం, కాస్మోటిక్ ఛార్జీలు, దుప్పట్లు, ప్లేట్లు, ట్రంకు పెట్టెలు, ఉచిత పుస్తకాలతో పాటు తల్లికి వందనం పథకం కూడా వర్తింపజేయాలన్నారు వసతి గృహాల్లో గత విద్యా సంవ త్సరంలో సాధించిన ప్రగతిని ఆయన సమీక్షించి ఇంకా మెరుగైన పురోగతిని సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంద న్నారు సంక్షేమ వసతి గృహాలను అర్హులైన పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవా లన్నారు. ఖాళీలు సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యం లో వస్తు గృహాల్లో ఎస్సీ, ఎస్టీ బీసీ ఓసి వర్గాల వారు జాయిన్ అయ్యేవిధంగా మల్టీ లెవెల్ వసతి గృహా లను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్కు మంత్రి వర్యులు సూచించారు వసతి గృహంలో మెనూ తప్పనిసరిగా అమలు చేయాలని విద్యార్థులతో కాసేపు ఆత్మీయంగా పలక రిస్తూ రెగ్యులర్గా బరువు లను తనిఖీ చేస్తూ అనారో గ్యాల పాలిటపడిన నేప థ్యంలో సమీప వైద్యుల ద్వారా వైద్య సేవలను అందించాలని సూచిం చారు.

జిల్లా కలెక్టర్ 8,340 విద్యార్థులకు ఐసిఐసిఐ ప్రోడెన్షియల్ ఇన్సూరెన్స్ ను ప్రవేశపెట్టడం వసతి గృహ సంస్కరణలకు తార్కాణమన్నారు.సంక్షేమ వసతి గృహాలలో ఉంటు న్న విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరాలన్నదే ముఖ్యమంత్రి ఆశయమ న్నారు. విద్యార్థుల విష యంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. విద్యార్థుల సమస్యలపై సంబంధిత అధికారులు మా దృష్టికి తీసుకురావాల ని, సీజనల్ జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ పరిసర పరి శుభ్రత పాటించాలన్నా రు. ప్రభుత్వం వసతి గృహాల సంక్షేమానికి స్టడీ మెటీరి యల్, నోటు పాఠ్యపుస్తకా లు దుప్పట్లు టవల్స్ సరఫరాతో పాటు కిటికీలకు గుమ్మాలకు దోమల మెస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాన మంత్రి అజయ్ కింద విలేజ్ డెవలప్మెంట్ ప్రణాళికల రూపొందించి గ్రామాలను అభివృద్ధి పరచాలన్నారు ప్రాధాన్యత క్రమంలో ఖాళీ లను పూరించి పూర్తిస్థాయి లో నిర్వహించాలని సూ చించారు. ప్రాంగణాలలో కిచెన్ గార్డెన్లు నిర్వహించి తాజా కూరగాయలను పండించాలన్నారు.

ట్యూ టరుల ఎక్కువ అవసర మైతే జిల్లా కలెక్టర్ వారి సహకారంతో నియమించు కోవాలన్నారు. వసతి గృహాలలో ఎలుకలు దోమలు బెడద లేకుండా నివారణ చర్యలను బలో పేతం చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ దురాగతాల చట్టం అమలుకు సంబంధించి పరిహారాలు చెల్లింపు పెండింగ్ అంశాలపై సమీక్షించి పెండింగ్ ఉన్న రూ/- 60 లక్షలను త్వరలో చెల్లిస్తామని మంత్రి తెలిపారు. ఇకపై అడ్వాన్సులు కూడా ఇవ్వడం జరుగు తుందన్నారు. వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ పై సమీక్షిస్తూ కృత్రిమ అవయవాల అవసరతపై ఆరా తీశారు 70 సంవ త్సరాలు నిండిన వయోవృద్ధులకు వయో వందన కార్యక్రమం అమ లు చేస్తూ ఐదు లక్షలు ప్రీమియం అందేందుకు పాటుపడాలన్నారు. జి ఎస్ డబ్ల్యూ ఎస్ సిబ్బంది సమయపాలనపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గంటి హరీష్ మాధు ర్, స్థానిక శాసన సభ్యులు ఏ ఆనందరావు, డిఆర్ఓ రాజకుమారి సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిని పి జ్యోతిలక్ష్మి దేవి తదితరులు పాల్గొ న్నారు.

Related Articles

కడలి భూపతి కనకదుర్గ ను మర్యాదపూర్వకంగా కలిసిన జర్నలిస్ట్ వినయ్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 15: కడలి భూపతి కనకదుర్గా లను జర్నలిస్ట్ వినయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా […]

ఉప్పాడ కొత్తపల్లి మత్స్యకారుల సముద్రపు వేటకు అడ్డులేదు: కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 26: మత్స్యకారుల సమస్యలపై మత్స్యకార ప్రతినిధులు మత్స్య శాఖల అధికారుల తో కూలంకశంగా పూర్తిగా చర్చించి మరో 10 రోజుల్లో అందరికీ […]

సోషల్ వర్కర్ చంద్రకుమార్ కుటుంబాని పరామర్శించిన ప్రజా నాయుకులు.

నేరేడుమిల్లి చంద్రకుమార్ కు ఘన నివాళులు అర్పించిన ప్రజా నాయకులు సోషల్ వర్కర్ గా పేరు పోందిన నేరేడుమిల్లి చంద్రకుమార్ 35 సం”ఇటివలే ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూమరణించారు. శనివారం ఆయనకు దినకర్మ కార్యక్రమాన్ని […]

బాల్య వివాహం, పోక్సో కేసులు నమోదు. ఇంటర్ విద్యార్థి ఫిర్యాదు పై

ఓ బాలికను వివాహం చేసుకున్న బాలుడిపై బాల్య వివాహం కేసుతో పాటు, పోక్సో కేసు నమోదు చేసిన ఘటన రాజమండ్రి ఒకటో పట్టణ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రజా ఆయుధం: ఓ బాలిక పెళ్లి […]